తెలంగాణలో జరుగుతున్న గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తెగడం లేదు. కొనసా…గుతూనే ఉంది. రెండో రౌండ్ ముగిసే సరికి సిట్టింగ్ ఎమ్మెల్సీ.. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్న గట్టిపోటీనిస్తున్నాడు. ప్రస్తుతం పల్లా కేవలం 3787 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
రెండో రౌండ్ లో పల్లా రాజశ్వేర్ రెడ్డికి 15857 ఓట్లు రాగా.. స్వతంత్ర్య అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 12070 ఓట్లు వచ్చాయి. ఇక తెలంగాణ జనసమితి అభ్యర్థి కోదండరాంకు 9448 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 6669 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ కు 3244 ఓట్లు పోలయ్యాయి.
Also Read: వైసీపీలో ఇప్పుడు గుర్తింపే పెద్ద సమస్య?
తొలి రౌండ్ లో పల్లాకు 16130 ఓట్లు రాగా.. తీన్మార్ మల్లన్నకు 12046, కోదండరాంకు 9080 ఓట్లు, బీజేపీ అభ్యర్థి 6615 ఓట్లు వచ్చాయి. ఐదు రౌండ్లు లెక్కించాల్సి ఉంది. నల్గొండలోని గిడ్డంగుల సంస్థకు చెందిన గోదాంలో బుధవారం ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ ఈరోజు మధ్యాహ్నానికి పూర్తి కావచ్చని అధికారులు తెలిపారు.
*టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి 1054 ఓట్ల ఆధిక్యం
ఇక ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి 17439 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాంచంద్రారావుకు 16385 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొ. నాగేశ్వర్ కు 8357 ఓట్లు , కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 5082 ఓట్లు పోలయ్యాయి.
Also Read: బ్రేకింగ్: తిరుపతి, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో పీవీ కూతురు వాణిదేవికి బీజేపీ అభ్యర్థి రాంచంద్రారావు గట్టి పోటీనిస్తున్నారు. వరంగల్ పరిధిలో స్వతంత్ర అభ్యర్థి నిరుద్యోగులు, గ్రాడ్యూయేట్ల మద్దతుతో అనూహ్యంగా ఓట్లు సంపాదిస్తున్నాడు. వీరిలో ఎవరైతే 50శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తారో వారే విజేతలు. ఆ 50శాతం రాకుంటే రెండో ప్రాధాన్యత ఓటు కీలకంగా మారనుంది. అది కోదండరాం, నాగేశ్వర్, తీన్మార్ మల్లన్నలకు విజయాన్ని చేకూర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి ఫలితాలు వెలువడితే కానీ క్లారిటీ రాదు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Counting of votes trs mlc candidates have the upper hand
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com