Single Dose Corona Vaccine: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. రెండేళ్లు మహమ్మారి సృష్టించిన ఉత్పాతం మామూలుది కాదు. మొత్తం ప్రపంచమే కుదేలైపోయింది. మొదటి దశలో వృద్ధులు, రెండో దశలో యువత, మూడో దశ మాత్రం కాస్త కనికరించింది. ప్రస్తుతం నాలుగో దశ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నిర్మూలనకు టీకాలను కొనుగొన్నారు. వాటి ద్వారానే వైరస్ కట్టడి జరిగిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కరోనా టీకా తీసుకున్న వారికి రక్షణ వ్యవస్థ ఉండటంతో అది దరిచేరదని ప్రచారం చేశారు. దాదాపు అందరికి టీకాలు వేసేలా సమాయత్తం చేశారు. కానీ కొందరికి టీకాలు తీసుకున్న వారికి జ్వరాలు రావడంతో వాటిని తీసుకునేందుకు భయపడుతున్నారు. కొందరైతే ఒకటే డోసు తీసుకుని ఇక రెండో డోసు తీసుకోవడానికి జంకుతున్నారు. అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసిన టీకాలు ఒకటే తీసుకుంటే సరిపోతుందని చెప్పడంతో అందరు ఒకటే డోసు తీసుకునేందుకు ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Rahul Gandhi Telangana Tour: రాహుల్ పర్యటనకు రంగులద్దాలని నేతల ప్రయత్నం?
ఇంకా అమెరికాలో 18 మిలియన్ల మందికి జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీంతో కూడా వారికి కొన్ని రోగాలు వస్తున్నట్లు తేలడంతో కొందరు వెనుకాడుతున్నారు. రక్తం గడ్డ కట్టే సిండ్రోమ్ అయిన డోంబోసైటి పెనియా సిండ్రోమ్ థాంటోసిప్ ప్రమాదం ఉందని భావిస్తన్నారు. అందుకే డోసులు తీసుకునేందుకు సాహసం చేయడం లేదు.

వ్యాక్సిన్ వేసిన మొదటి రెండు వారాల్లో ఆరోగ్యం దెబ్బతింటోంది. శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశముంది. తలనొప్పి, వికారం లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మొత్తానికి కరోనా వ్యాక్సిన్ కూడా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈక్రమంలో కరోనా వ్యాక్సిన్ ప్రభావంతో ప్రజలుఇబ్బందులుఎదుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి అంతానికి టీకాలు పని చేస్తాయా? లేక ప్రమాదంలో పడేస్తుందా అనే సందేహాలు వస్తున్నాయి.
ఇంకొందరు ఒకే డోసు తీసుకుని ఇక తీసుకోమని మొండికేస్తున్నారు. దీంతో కరోనా తగ్గుతుందా? లేక మళ్లీ విజృంభిస్తుందా అనే సంశయాలు వస్తున్నాయి. నాలుగో దశ ప్రారంభమైతే కష్టాలు మొదలైనట్లే అని చెబుతున్నారు. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Also Read:Mahesh Babu- Director Sukumar: అప్పుడు చెడింది, ఇప్పుడైనా కుదురుతుందా ?
[…] Also Read:Single Dose Corona Vaccine: సింగిల్ డోస్ కరోనా టీకాలతో… […]