Mahesh Babu- Director Sukumar: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తోన్న సినిమా ‘సర్కారు వారి పాట’. అయితే, ఈ సినిమా సెట్ లో తరుచూ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కనిపిస్తున్నాడు. మహేష్ బాబును ప్రత్యేకంగా కలిసి కాసేపు ముచ్చట్లు పెడుతున్నాడు. ఉన్నట్టు ఉండి సుకుమార్, మహేష్ ను ఎందుకు పదే పదే కలుస్తున్నాడు ? ఇప్పుడు ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. వీరి కాంబినేషన్ లో మరో సినిమా రానుందా ? నిజానికి ఒకప్పుడు మహేష్ బాబు – సుకుమార్ కలిసి ఒక సినిమా చేయాలనుకున్నారు. కానీ, సినిమా కుదరలేదు. ఏడాదిపాటు సుకుమార్ కథ పై కూర్చున్నాడు.

Mahesh Babu- Director Sukumar
మహేష్ కూడా పలుమార్లు కథ విని వర్క్ చేయమంటూ చాలా ల్యాగ్ చేశాడు. చివరకు ఏడాది తర్వాత తీరిగ్గా కథ నచ్చలేదు, నేను ఈ సినిమా చేయలేను అంటూ సుకుమార్ కి హ్యాండ్ ఇచ్చాడు మహేష్. కట్ చేస్తే.. అదే కథతో పుష్ప వచ్చింది. హీట్ అయ్యింది. అప్పటి నుంచి సుక్కు – మహేష్ మధ్య స్నేహం మళ్ళీ చిగురించింది. తన సినిమాని మహేష్ రిజెక్ట్ చేసినా.. సుకుమార్ మాత్రం మహేష్ కోసం మరో కథను సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నాడు.
Also Read: Babu Gogineni: విశ్వక్ సేన్ మరియు దేవి నాగవల్లి వివాదం గురించి బాబు గోగినేని సెన్సషనల్ కామెంట్స్

Mahesh Babu- Director Sukumar
తాజాగా కలిసింది కూడా.. తానూ చేయబోతున్న కథకు సంబంధించిన ఆలోచనను చెప్పడానికేనట. కాకపోతే వీరి కలయికలో సినిమా అనేది ఇప్పట్లో కష్టమే. ఎందుకంటే.. మహేష్ తన తర్వాత సినిమాలను త్రివిక్రమ్, అండ్ రాజమౌళితో చేయబోతున్నాడు. ఆ సినిమాల తర్వాత మహేష్ రేంజ్ మారిపోవచ్చు. అప్పుడు లెక్కలను బట్టి సినిమా ఉంటుంది. సుకుమార్ కూడా పుష్ప 2తో మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు కాబట్టి.. సుకుమార్ కి హిట్ వస్తే.. రాజమౌళి తర్వాత మహేష్, సుకుమార్ తో సినిమా చేసే అవకాశం ఉంది. మరీ ఒకప్పుడు చెడింది, ఇప్పుడైనా కుదురుతుందా ? చూడాలి. ఇక గతంలో వీరి కలయికలో వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు.
Also Read:Bhala Thandanana Review: రివ్యూ : ‘‘భళా తందనాన’