
అందాలున్నది చూపించడానికే. కనువిందు చేయడానికే. చూపరులను ఆకట్టుకోవడానికే. సినీ పరిశ్రమలో ఎందరో కథానాయికలువచ్చారు. వారి అందాలతో కనువిందు చేశారు. ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. కట్టిపడేశారు. తాజాగా అదే కోవలో సీనియర్ నటి శ్రియ దూసుకుపోతున్నారు. అందాల ఆరబోతతో రెచ్చిపోతున్నారు. నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. భర్త కౌగిలిలో ఒదిగిపోతూ రెచ్చగొడుతున్నారు. అందాల భామ అందరితో తన అనుభవాలు పంచుకుంటున్నారు.
సోషల్ మీడియా వేదికగా అందాలతో షేక్ అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో యమ యాక్టివ్ గా ఉన్న ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు ఫ్రెష్ రొమాంటిక్ యాంగిల్స్ షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. తన హాట్ హాట్ అందాలతో రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తోంది. పైగా ఆయా ఫొటోలు, వీడియోలను అందరి ముందుకు తెస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దీంతో ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.
2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్ ని పెళ్లాడిన శ్రియ సినిమాలకు మెల్లగా దూరమైంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను ఊపేస్తోంది. భర్తను వెంట పెట్టుకుని జాలీ ట్రిప్పులేస్తూ నెటిజన్లను పలకరిస్తోంది. ఇటీవల విదేశాలకు వెళ్లిన ఈ జంట అక్కడ బ్యూటీఫుల్ లొకేషన్లలో తెగ రెచ్చిపోతున్నారు. బోటు షికారు చేస్తూ ఎంజాయ్ చేశారు. బోటును తమ రొమాన్స్ కోసం వేదికగా మార్చుకుని సముద్రంలో మైమరచిపోయారు.
ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు షేర్ చేసిన శ్రియ భర్త షర్ట్ లేకుండా అర్థనగ్నంగా కనిపించగా లో దుస్తులు కనిపించేలా శ్రియ జోష్ లో దర్శనమిచ్చింది. దీంతో పాటు భర్తతో ముద్దులాటలో మునిగిపోయిన పిక్స్ పంచుకుంది. దీంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో శ్రియ ఓ కీలక పాత్ర పోషిస్తుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాబోతున్న సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో ఆమె కనిపించనుంది.