
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి శ్రీలంక టీమ్ ఇండియా ముందు మంచి స్కోరే నిర్దేశించింది. మొత్తం 50 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. చివర్లో కరుణరత్నె (43) ధాటిగా ఆడి లంక జట్టుకు పోరాడే స్కోర్ అందించాడు. అతడికి చమీరా (13) సహకరించాడు.