Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్హెడేక్ తగ్గించుకోబోతున్న 'పూజా హెగ్డే' !

హెడేక్ తగ్గించుకోబోతున్న ‘పూజా హెగ్డే’ !

క్రేజీ ముద్దుగుమ్మ ‘పూజా హెగ్డే’ పక్కా కమర్షియల్ బ్యూటీ. లాభం ఉంటేనే ఏ పని అయినా చేస్తానంటూ మొహమాటం లేకుండా చెబుతుంది. చిన్న బైట్ ఇవ్వమని చెప్పినా ఎంత ఇస్తారు అంటూ లెక్కలు అడుగుతుందట. మరీ, ఇలాంటి పూజా హిందీలో ఒక సినిమా ఒప్పుకుంది. ఆ సినిమాకి తగిన రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు. పైగా హోటల్ ఖర్చులు వగైరాలు అన్నీ ఈ అమ్మడు చూసుకుంటుంది.

అయితే, తాజాగా ఈ ముద్దుగుమ్మ త‌న హెడేక్ త‌గ్గించుకునేందుకు తగిన చ‌ర్య‌లు తీసుకోబోతుంది. ఇటీవ‌ల అన‌వ‌స‌రంగా నెత్తి మీద‌కు తెచ్చుకున్న ఈ ఫ్రీ సినిమాని త్వరగా వదిలించుకోవడానికి ఆ సినిమా మేకర్స్ కి కబురు పెట్టిందట. ఈ నేప‌థ్యంలో పూజా హెగ్డే ఆ సినిమా నిర్మాతలకు ఎలాంటి మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పబోతుంది.

ఇక త‌న‌కు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ అన్నా, తెలుగు నిర్మాతలు అన్నా అన్ని వేళ‌లా ప్రాణ‌మ‌ని అంటుంది ఈ బ్యూటీ. ఎందుకంటే ఒక్కో తెలుగు సినిమాకి ఈ బ్యూటీ దాదాపు నాలుగు కోట్లు తీసుకుంటుంది. పైగా స్టార్ హీరోయిన్ గా త‌న‌కు కీర్తిప్ర‌తిష్ట‌లు తెచ్చిపెట్టిన టాలీవుడ్‌ కు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటానని ఆ మధ్య ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కూడా పూజా చెప్పుకొచ్చింది.

పైగా ఆ ఇంట‌ర్వ్యూలోనే తెలుగు ప్రేక్ష‌కులు సినిమా వాళ్ల‌ను ఆరాధిస్తార‌ని, దేవుళ్ల‌గా పూజిస్తార‌ని కూడా పూజా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ‘అల వైకుంఠపురములో’ సినిమా తరువాత అమ్మడు రేంజ్ బారీగా పెరిగిపోయింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular