Homeసినిమా వార్తలుఅరె.. చైతు అసలు గ్యాప్ ఇవ్వట్లేదు !

అరె.. చైతు అసలు గ్యాప్ ఇవ్వట్లేదు !

అక్కినేని నాగ చైతన్య సినిమాల ఎంపిక దగ్గర నుండి షూటింగ్ లో పాల్గొనడం వరకూ అంతా స్లోగానే ఉండేది ఒకప్పుడు. కానీ ప్రస్తుతం చైతు స్పీడ్ పెంచాడు. నిజానికి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోన్న హీరోల్లో నాని ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తూ.. తరువాత సినిమాల కోసం కథలు వింటూ నాని, కరోనా కష్టకాలంలో కూడా ఖాళీ లేకుండా కష్టపడుతున్నాడు. ఇప్పుడు చైతు, నానికి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఎప్పుడూ ఫ్రీగా […]

movies
అక్కినేని నాగ చైతన్య సినిమాల ఎంపిక దగ్గర నుండి షూటింగ్ లో పాల్గొనడం వరకూ అంతా స్లోగానే ఉండేది ఒకప్పుడు. కానీ ప్రస్తుతం చైతు స్పీడ్ పెంచాడు. నిజానికి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోన్న హీరోల్లో నాని ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తూ.. తరువాత సినిమాల కోసం కథలు వింటూ నాని, కరోనా కష్టకాలంలో కూడా ఖాళీ లేకుండా కష్టపడుతున్నాడు.

ఇప్పుడు చైతు, నానికి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఎప్పుడూ ఫ్రీగా ఉండడానికి ఇష్టపడే చైతు, గత కొన్ని నెలలుగా షూటింగ్ లతో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఇప్పటికే క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమాని పూర్తి చేశాడు. ప్రజెంట్ విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అందరూ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి ఇంటికే పరిమితం అయితే,

చైతు మాత్రం ఈ సినిమా షూట్ లో నిన్నటివరకూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక థాంక్యూ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుందని. . ఈ రోజు నుండి ఈ సినిమాలో తన క్యారెక్టర్ కు చైతు డబ్బింగ్ కూడా చెప్పడం స్టార్ట్ చేశాడని తెలుస్తోంది. అలాగే నాగ చైతన్య బాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతున్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా రానున్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో చైతు నటిస్తున్నాడు.

ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర 18 నిమిషాల పాటు ఉంటుందని.. ఒక తెలుగు కుర్రాడి పాత్రలో చైతు కనిపించబోతున్నాడని.. సినిమాలో చైతు తెలుగులోనే మాట్లాడుతాడని మొత్తానికి ఇదొక గెస్ట్ రోల్ అని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమా షూటింగ్ కూడా లడఖ్ లో మొదలు కానుంది. వచ్చే నెల ఫస్ట్ వీక్ నుండి షూటింగ్ స్టార్ట్ చేయనున్నామని ఇప్పటికే అమీర్ ఖాన్ చెప్పాడు. ఏది ఏమైనా నాగచైతన్య గ్యాప్ ఇవ్వట్లేదు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper