దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిసున్న ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ టీజర్‌ను ఈనెల 22న విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ తెలిపింది. ఈ మేరకు కొద్ది సేపటి కిందట అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఉదయం 11 గంటలకు తారక్ భీం టీజర్‌ను ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు చెప్పారు. ‘ఆర్ఆర్ఆర్’ లో అల్లూరి సీతారామారాజుగా రామ్‌చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ టీజర్ వాయిదా పడింది. మొత్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు 22న పండుగ వాతావారణం నెలకొననుంది.
https://twitter.com/RRRMovie/status/1318424215339495425?s=20