
జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కొద్ది రోజులుగా ఉగ్రవాదుల ఏరివేతకు భారత్ తీవ్రం శ్రమిస్తోంది. సెర్చ్ ఆపరేష్ పేరిట భద్రతా బలగాలు తీవ్రవాదులను మట్టుబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తాజాగా పోషియాన్ జిల్లాలోని మెల్హోరా ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. వీరి వద్ద నుండి ఒక ఏకె రైఫిల్, పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.