Phone Tapping In Telangana: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందురుతోంది. వ్యక్తిగత గోప్యతను తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తుతున్నాయి. మోయినాబాద్ ఫామ్‌హౌస్ వ్యవహారంలో.. పోలీసుల వద్ద ఉండాల్సిన కాల్ రికార్డులు.. మీడియాలో, ప్రగతి భవన్లో లీక్ కావడం.. ప్రభుత్వం ఫోన్ ట్యాంపింగ్ చేస్తుందనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. తాజాగా గవర్నర్ తమిళిసై సైతం ఫోన్ ట్యాపింగ్‌పై అనుమానం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఈ వ్యవహారన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్‌తోనే రహస్యాలు.. బట్టబయలు..
మోదీ రైతు చట్టాలను రద్దు చేస్తున్నారని ఎవరికీ తెలియదు. కానీ కేసీఆర్ మాత్రం ముందుగా ఊహించారు. తమ డిమాండ్‌తోనే చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటనలు ముందుగానే చేశారు. కేసీఆర్ ప్రకటనల్లోని సారాంశం.. మోదీ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన తర్వాత కానీ అర్థం కాలేదు. ఎవరికీ తెలియనిది కేసీఆర్‌కు భలే తెలిసిందే అనుకున్నారు అంతా. చాలా విషయాల్లో తెలంగాణ ప్రభుత్వానికి ముందస్తు సమాచారం వస్తోంది. దీంతో నమ్మకమైన సోర్స్ కేసీఆర్‌కు ఉందని ఇన్నాళ్లూ అందరూ భావించారు. కానీ అసలు విషయం సోర్సు కాదని.. ఫోన్ ట్యాపింగ్ అని సమాచారం. ఏ ఫోన్ ట్యాపింగ్ అయితే ఇన్నాళ్లూ కేసీఆర్‌కు బలంగా మారాయో.. ఇపుపడు అవే ఆయన సర్కార్‌ను చుట్టుముడుతున్నాయి.
రాజకీయ ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకే..
సీఎం కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు రాజ్యాంగ హక్కులను సైతం కాలరాస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం ఉందని తాను ఏం చేసినా చెల్లుతుందనే భావనలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరికు గవర్నర్ ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేయడం.. ఈమేరకు గవర్నర్ సైతం అనుమానం వ్యక్తం చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. తన ఫోన్‌కు తుషార్ అనే వ్యక్తి నుంచి మెసేజ్ రాగానే ఫామ్ హౌస్ కేసులో ఉన్న తుషార్ అని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారని.. తన ఫోన్‌కు వచ్చిన మెసేజ్ గురించి టీఆర్ఎస్ నేతలకు ఎలా తెలిసిందని గవర్నర్ ఆశ్చర్యపోయారు. అసాంఘిక శక్తుల కదలికలు తెలుసుకునేందుకు పోలీసులు టెలిఫోన్ యాక్టు ప్రకారం అనుమానితుల ఫోన్లను టాపింగ్ చేయవచ్చు. కానీ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దొంగే దొంగ అన్న చందంగా..
కేటీఆర్ ఇటీవల కేంద్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో దాదాపు 10 వేల మందికిపైగా ఫోన్లలో పెగాసస్ ఉందని ఆరోపించారు. తమ విషయాలు అన్నీ మోడీ తెలుసుకుంటున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫోన్‌ను కూడా ప్రధాని మోదీ ట్యాప్ చేస్తున్నారు.. అని సంచలన ప్రకటన చేశారు. అది ఊహాగానామా లేక రూఢీగా తెలుసా అన్నదానిపై స్పష్టత లేదు. కేటీఆర్ చేసిన ఆరోపణలు ఇపుపడు టీఆర్ఎస్ సర్కార్కే చుట్టుకుంటున్నాయి. కేటీఆర్ ఒక్క వేలు కేంద్రంవైపు చూపిస్తే.. విపక్షాలన్నీ అవే ఆరోపణలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్నాయి. దొంగే దొంగ అన్న చందగా కేటీఆర్ వ్యవహారం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్న సమయంలో ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై కోర్టులో కేసు కూడా ఉంది. తాజాగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ వ్యవహారంపై ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ తమ ఫోన్లు కూడా వింటున్నారేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బయటకు కనిపించకపోయినా.. టీఆర్ఎస్ నేతల్లో భయం, ఆందోళన కనిపిస్తోంది. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో కూడా పైలట్ రోహిత్‌రెడ్డే ఎక్కువగా చొరవ చీపినట్లు కార్ రికార్డు ఆధారంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తమ వ్యవహారాలను కేసీఆర్ ఎప్పుడు భయటపెడతారో ఆన్న టెన్షన్ కనిపిస్తోంది.
రంగంలోకి కేంద్రం..
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్రం సీరియస్‌గా పరిగణిస్తోంది. ఇప్పటికే కేసీఆర్‌కు చెక్ పెట్టాలని చూస్తున్న బీజేపీకి.. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రే ఆయుధం ఇచ్చినట్లు అయింది. ఈ వ్యవహారంపై అత్యంత రహస్యంగా విచారణ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌పై ప్రస్తుతం కోర్టుల్లో పిటిషన్లు ఉన్నాయి. విచారణకు అనుమతి ఇస్తే.. అధికారిక విచారణ అవుతుంది. లేకపోతే.. కేంద్ర ప్రభుత్వం తమ నిఘా వర్గాల ద్వారా అసలు విషయం తెలుసుకునే అవకాశం ఉంది. తద్వారా కేసీఆర్‌ను ఇరుకున పెట్టాలని బీజేపీ నేతలు ఆలోచనగా కనిపిస్తోంది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Center is serious about phone tapping in telangana secret investigation
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com