Homeబిజినెస్Yamaha first electric scooter: Yamaha నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. మైలేజ్ తెలిస్తే క్యూ...

Yamaha first electric scooter: Yamaha నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. మైలేజ్ తెలిస్తే క్యూ కడతారు..

Yamaha first electric scooter: ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరిగిపోతుంది. ఇప్పటికే చాలా కంపెనీలు పెట్రోల్ వాహనాలకు బదులు EV లను మార్కెట్లోకి ప్రవేశపెట్టి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే కాస్త లేటుగా అయినా లేటెస్ట్ స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది యమహా కంపెనీ. ఒకప్పుడు యమహా కంపెనీ నుంచి బైక్ మార్కెట్లోకి వస్తుందంటే యూత్ ప్రత్యేకంగా ఎదురుచూసేవారు. ఇప్పుడు కూడా స్కూటర్ విషయంలో ఈ కంపెనీ ప్రత్యేక శ్రద్ధ చూపించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ […]

Yamaha first electric scooter: ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరిగిపోతుంది. ఇప్పటికే చాలా కంపెనీలు పెట్రోల్ వాహనాలకు బదులు EV లను మార్కెట్లోకి ప్రవేశపెట్టి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే కాస్త లేటుగా అయినా లేటెస్ట్ స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది యమహా కంపెనీ. ఒకప్పుడు యమహా కంపెనీ నుంచి బైక్ మార్కెట్లోకి వస్తుందంటే యూత్ ప్రత్యేకంగా ఎదురుచూసేవారు. ఇప్పుడు కూడా స్కూటర్ విషయంలో ఈ కంపెనీ ప్రత్యేక శ్రద్ధ చూపించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ స్కూటర్ మిగతా వాటికంటే భిన్నమైన డిజైన్ తో ఉండి.. మైలేజ్ విషయంలో ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇంకా ఈ స్కూటర్ లో ఏమి ఉన్నాయి? దీని ధర ఏంటో చూద్దాం..

Yamaha కంపెనీ నుంచి EC -06 అనే స్కూటర్ ప్రస్తుతం మార్కెట్లో ప్రభంజనం సృష్టిస్తోంది. ఇది రిలీజ్ అయిన తర్వాత అమ్మకాలు ఆశించినంత లేనప్పటికీ ఆ తర్వాత మెల్లగా ఉంచుకుంటున్నాయి. ఈ స్కూటర్ గురించి తెలిసినవారు వెంటనే దీనిని కొనేందుకు క్యూ కడుతున్నారు. 2026 ఫిబ్రవరిలో మార్కెట్లోకి వచ్చిన ఈ స్కూటర్ మొదటి నెలలో కేవలం 92 యూనిట్లు మాత్రమే వికయాలు చేస్తుంది. కానీ మార్చి నెలలో దీని అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. అంటే 232 యూనిట్ల సేల్స్ తో ప్రత్యేకతను చాటుకుంది. అయితే ఈ స్కూటర్లో ఉండే బ్యాటరీ వ్యవస్థతోపాటు మైలేజ్ బాగా ఇవ్వడంతో చాలామంది తీరిని కోరుకుంటున్నారు తెలుస్తోంది.

యమహా EC-06 అనే స్కూటర్లో 4 kWh నితియం అయాన్ బ్యాటరీ. ఇది 4.5 kW ఎలక్ట్రిక్ మోటార్ తో పనిచేస్తుంది. ఫలితంగా 8.98 బిహెచ్పి పవర్ ను అందిస్తుంది. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 160 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. రోజువారి కార్యాలయాలకు వెళ్లే వారితో పాటు సమీప గ్రామాలకు లేదా ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ స్కూటర్ మైలేజ్ బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ స్కూటర్ లోని బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ కావడానికి 9 గంటల సమయం పడుతుంది.

యమహా EC -06 స్కూటర్ ధర రూ.1.67 లక్షలు గా ఉంది. దీని ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఇందులోని ఫీచర్లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ స్కూటర్ లో LED హెడ్ లాంప్స్, టెయిల్ లైట్స్ ప్రత్యేకంగా నిలుస్తాయి. అంతేకాకుండా దీనికి LCD స్క్రీన్ ఉండడంతో ఇందులో నావిగేషన్, ఫోన్ కనెక్టివిటీ వంటి సదుపాయాలు ఉంటాయి. అయితే దీని డిజైన్ ప్రత్యేకంగా రూపొందించారు. ప్రస్తుతం ఇది మార్కెట్లో టీవీఎస్ ఐ క్యూబ్, Ather Rizta వంటి వాటికి గట్టి పోటీ ఇస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper