spot_img
Homeబిజినెస్Xiaomi 17T Series: xiaomi నుంచి కొత్త ఫోన్లు.. డిస్ ప్లే మాములుగా ఉండదు..

Xiaomi 17T Series: xiaomi నుంచి కొత్త ఫోన్లు.. డిస్ ప్లే మాములుగా ఉండదు..

Xiaomi 17T Series: xiaomi కంపెనీ కొత్త మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకురావడంలో ఉత్సాహం చూపిస్తోంది. ఇందులో భాగంగా లేటేస్ట్ గా 17T సిరీస్ ను మొదటిసారిగా రెండు వేర్వేరు సైజుల ఫ్లాగ్షిప్ డిస్ప్లే వెర్షన్స్‌లో అందుబాటులోకి తీసుకువస్తోంది . ఈ సిరీస్‌లో స్టాండర్డ్ Xiaomi 17T, Xiaomi 17T Pro అనే రెండు మోడల్స్ ఉంటాయి. ఈ మొబైల్స్ లో ట్రిపుల్ కెమెరా ఉండడంతో పాటు వినియోగదారులకు అనుకూలంగా ఉండే ఫీచర్లు ఉండనున్నాయి. అయితే ఇవి మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయి? వీటి వివరాల్లోకి వెళితె..

షియోమీ 17T సీరిస్ లో భాగంగా Xiaomi 17T 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది 1.5K రిజల్యూషన్ ను అందిస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌ని కలిగి ఉంటుంది. అయితే 17T Pro మరింత పెద్దగా 6.83-అంగుళాల AMOLED స్క్రీన్‌ని కలిగి ఉంటుంది. ఇది కూడా 1.5K రిజల్యూషన్ తో నాణ్యమైన డిస్ ప్లేను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్ అధిక 144Hz రిఫ్రెష్ రేట్‌ని ఆఫర్ చేస్తుంది.

17T సీరీస్ లోని రెండు మొబైల్ MediaTek Dimensity 8500 Ultra చిప్‌సెట్‌ని కలిగి ఉంటుంది. దీనికి 12GB RAM, 256GB లేదా 512GB స్టోరేజ్‌ని సపోర్టు చేస్తుంది. అలాగే ఈ మొబైల్ లో 6,500mAh బ్యాటరీ ఉండగా.. 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 17T Pro మరింత శక్తివంతమైన MediaTek Dimensity 9500 ప్రాసెసర్‌, 7,000mAh బ్యాటరీ ఉండగా.. దీనికి 100W వైర్డ్ , 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ని సపోర్టు చేస్తుంది.

కెమెరా విభాగంలో, రెండు మోడల్స్‌లోనూ Leica Summilux మూడు కెమెరా సెటప్ ను అమర్చారు. ఇవి 50MP మెయిన్ కెమెరా ఉండగా.. 50MP టెలిఫోటో తో పాటు 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా ఉండనుంది . 17T Proలో 50MP Light Fusion 950 ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. స్టాండర్డ్ 17T 5x ఆప్టికల్ జూమ్ టెలిఫోటో తో 120x డిజిటల్ జూమ్‌ని సపోర్ట్ చేస్తుంది.

గ్లోబల్ లో ఈ రెండు మొబైల్స్ May 28న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో స్టాండర్డ్ Xiaomi 17T జూన్ 4న లాంచ్ అవుతుంది.కానీ రెండు మోడల్స్ భారతదేశంలో అందుబాటులో ఉంటాయా అనేది ఇంకా ఖచ్చితంగా తెలియలేదు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper