Homeబిజినెస్Vivo T5 5G Price : అదిరిపోయే డిజైన్.. దిమ్మదిరిగే ఫీచర్లు.. ఈ ఫోన్ 9న...

Vivo T5 5G Price : అదిరిపోయే డిజైన్.. దిమ్మదిరిగే ఫీచర్లు.. ఈ ఫోన్ 9న వస్తోంది..

Vivo T5 5G Price : నిత్యావసరాల లిస్టులో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కూడా ఉంటోంది. బయటకు వెళ్లినప్పుడు జేబులో పర్సుతో పాటు చేతిలో కచ్చితంగా ఫోన్ ఉండాల్సిందే. లేకపోతే ఏదో కోల్పోయినట్లు ఫీలవుతాం. అయితే ఈ ఫోన్ చూడడానికి ఆకర్షణీయంగా ఉండాలని అనుకుంటారు. మొదట్లో వచ్చిన ఫోన్ల కంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఆకర్షణీయంగా మారాయి. మరోవైపు వినియోగదారులు సైతం సన్నని నాజుగ్గా ఉండే ఫోన్లనే ఎక్కువగా కోరుకుంటున్నారు. ఈ తరుణంలో వివో కంపెనీ టీ […]

Vivo T5 5G Price : నిత్యావసరాల లిస్టులో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కూడా ఉంటోంది. బయటకు వెళ్లినప్పుడు జేబులో పర్సుతో పాటు చేతిలో కచ్చితంగా ఫోన్ ఉండాల్సిందే. లేకపోతే ఏదో కోల్పోయినట్లు ఫీలవుతాం. అయితే ఈ ఫోన్ చూడడానికి ఆకర్షణీయంగా ఉండాలని అనుకుంటారు. మొదట్లో వచ్చిన ఫోన్ల కంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఆకర్షణీయంగా మారాయి. మరోవైపు వినియోగదారులు సైతం సన్నని నాజుగ్గా ఉండే ఫోన్లనే ఎక్కువగా కోరుకుంటున్నారు. ఈ తరుణంలో వివో కంపెనీ టీ సిరీస్ లో కొత్త ఫోన్ ను సెప్టెంబర్ 2 బుధవారం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ డిజైన్ గురించి తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు. మరి దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

స్మార్ట్ ఫోన్ ప్రముఖ బ్రాండ్ వివో ‘టీ5 5జీ’ అనే కొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని డిజైన్ గురించి ముందుగా చెప్పాలి. ఇది 7.99 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. మూలలు 3డి వలె వంపులు తిరిగా ఉంటాయి. బెజెల్ లెస్ లుక్ తో ఆకట్టుకుంటుంది. బ్యాక్ సైడ్ ప్యానెల్ ప్లాస్టిక్ ప్రేమ్ లా కనిపిస్తుంది. ఆపిల్, శ్యామ్సంగ్ వంటి ఫోన్లకు ధీటుగా డిజైన్ ను తీర్చిదిద్దారు. ఒక రకంగా దీనిని చేతిలో పట్టుకుంటే అందరూ మీ వైపే చూస్తారు అన్నట్లుగా ఉంటుంది. మరోవైపు చేతిలో పట్టుకోవడాగి గ్రిప్ ను కలిగి ఉంటుంది.

కేవలం డిజైన్ మాత్రమే కాకుండా ఈ ఫోన్ లో చాలా విశేషాలు ఉన్నాయి. ఇందులో కెమెరా పనితీరు భేష్ అనుకోవచ్చు. 50 మెగా పిక్సెల్ తో కూడిన సోనీ ఐఎంఎంఎక్స్ 882 కెమెరాను కలిగి ఉంది. 8 ఎంపీతో అల్ట్రా వైడ్ లెన్స్ పనిచేస్తాయి. ఆప్టికల్ ఇమేజ్ తో పాటు స్టెబిలైజేషన్ ఉండడం వల్ల రాత్రి వేళ్లలో కూడా అద్భుతమైన ఫొటోలను తీసుకోవచ్చు. సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్, వీడియోల కోసం 4 కె రిజల్యూషన్ పనిచేస్తుంది.

ఈ కొత్త ఫోన్ లో 7,050 బ్యాటరీ పనిచేయనుంది. దీనిని ఛార్జింగ్ చేయడానికి 44 వాట్ ఛార్జర్ సపోర్టు చేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 22 గంటల పాటు నిరంతరంగా వాడుకోవచ్చు. ఇందులో 7500 టర్బో ఆక్టాకోర్ చిప్ సెట్ తో పాటు ఏఐ ప్రాసెసింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. బెంచ్ మార్క్ ఎగ్జామ్ లో ఇది 12 లక్షలకు పైగా స్కోర్ సాధించడం విశేషం.

ఈ ఫోన్ ధర 6 జీబీ ర్యామ్ తో పాటు 128 స్టోరేజ్ ఆప్షన్లు కలిగిన ఫోన్ ధర రూ.34,999తో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ఫోన్ ధర రూ.49,999తో అమ్ముతున్నారు. అయితే ఈ ఫోన్ సెప్టెంబర్ 9 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. వీటిపై హెచ్ డీఎఫ్సీ, ఎస్ బీఐ, యాక్సింగ్ బ్యాంకులు రూ.4,000 వరకు ఆఫర్లను ప్రకటించాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper