Ola : తమ ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు 2-వీలర్ సెగ్మెంట్‌లో పెద్ద సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈవీ స్టార్టప్ తన అమ్మకాల పరిమాణాన్ని, మార్కెట్ వాటాను పెంచుకోవడానికి ఎలక్ట్రిక్ 2-వీలర్ సెగ్మెంట్ కోసం కొత్త 2-వీలర్‌లపై పనిచేస్తోంది. హెచ్‌టీ నివేదిక ప్రకారం.. వీటిని వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి విడుదల చేయవచ్చు. ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్ ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్ , హోండా వంటి కంపెనీలతో పోటీ పడుతోంది.
ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ వద్ద ఎలక్ట్రిక్ 2-వీలర్ స్కూటర్ల చాలా మోడల్స్ ఉన్నాయి. వాటితో పాటు ఇప్పుడు ఓలా దేశంలో ఆరు వేర్వేరు కొత్త ఎలక్ట్రిక్ 2-వీలర్లను విడుదల చేయాలని యోచిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ రాబోయే స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఆగస్టు 15, 2025న ఈ ఎలక్ట్రిక్ 2-వీలర్‌లను ఆవిష్కరించే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేయనున్న ఓలా
ఈ రాబోయే మోడళ్లతో ఓలా ఎలక్ట్రిక్ దేశంలో పట్టణ ప్రయాణికుల నుంచి సాహస రైడర్‌ల వరకు అందరి అవసరాలను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో పాటు ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే అనేక ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసే ప్రణాళికలను కలిగి ఉన్నట్లు ప్రకటించింది. ఇందులో స్పోర్ట్‌స్టర్, క్రూయిజర్, రోడ్‌స్టర్ ప్రో, అడ్వెంచర్, డైమండ్‌హెడ్ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ శ్రేణిని మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటితో పాటు ఓలా ఎలక్ట్రిక్ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల శ్రేణిని కూడా విడుదల చేయాలని యోచిస్తోంది.
6 2-వీలర్‌లపై పనిచేస్తున్న కంపెనీ
ఓలా ఎలక్ట్రిక్ పైప్‌లైన్‌లో 6 కొత్త ఎలక్ట్రిక్ 2-వీలర్‌లు ఉన్నాయి. వీటిలో ఒకటి S1 స్పోర్ట్స్, ఇది హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా రానుంది. ఇది ప్రస్తుత ఓలా S1 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. ఇది S1 శ్రేణిలో అత్యంత పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయ్యే అవకాశం ఉంది. కొత్త ప్లాట్‌ఫారమ్ S2పై ఆధారపడిన అనేక కొత్త మోడళ్లు ఉంటాయి. ఓలా S2 శ్రేణిలో S2 సిటీ, S2 స్పోర్ట్స్, S2 టూరర్ ఉంటాయి. S1 సిటీ ఒక కమ్యూటర్ మోడల్‌గా ఉంటుంది. అయితే S2 స్పోర్ట్స్ ఒక హై-పెర్ఫార్మెన్స్ మోడల్‌గా ఉంటుంది. మరోవైపు S2 టూరర్ ఎక్కువ రేంజ్‌తో వస్తుంది.