Homeబిజినెస్Toyota Corolla Cross 7 seater: లగ్జరీ ప్రియులకు సూపర్ కారు.. మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందంటే?

Toyota Corolla Cross 7 seater: లగ్జరీ ప్రియులకు సూపర్ కారు.. మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందంటే?

Toyota Corolla Cross 7 seater: భారతీయులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. ముఖ్యంగా కార్ల విషయంలో ఒకప్పటి మనసుతో కాకుండా ఇప్పుడు లగ్జరీ కార్లు కొనాలనే ఆలోచనతో ఉన్నారు. మీరు ఆలోచనలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు లగ్జరీ కార్లను నేరుగా ఇండియాకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, వోల్వో వంటి కార్లు ఇప్పటికే చాలామంది కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు విదేశాల్లోనే ఎక్కువగా విక్రయాలు జరిపే టయోటా కంపెనీ కూడా లగ్జరీ కార్లను భారతీయ వినియోగదారులకు అనుగుణంగా తయారుచేసి లాంచ్ చేయబోతుంది. ఇందులో భాగంగా ఈ కంపెనీ Corolla Cross అనే కారును ఈ ఏడాదిలో విడుదల చేయబోతుంది. ఇది TNGA ప్లాట్ ఫామ్ పై రెడీ అవుతుంది. దీని గురించి ఇప్పటికే ఆన్లైన్లో సమాచారం అందడంతో చాలామంది లగ్జరీ లవర్స్ దీనిని కొనేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఈ కారులో ఉండే విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఈ ఏడాదిలో టయోటా నుంచి Corolla Cross 7 Seater మార్కెట్లోకి రాబోతుంది. SUV సెగ్మెంట్లో వస్తున్న ఈ కారు డిజైన్ చూస్తే ఆగలేక పోతారు. మూడు వరస సీట్లను అమర్చడానికి వీలుగా 4460 ఎం ఎం, 4490 ఎం ఎం పొడవు కంటే ఎక్కువగా ఉంటుంది. వెనుక భాగంలో ప్రత్యేకంగా స్థలాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిగా బోల్డ్ లుక్ తో కనిపించే ఈ కారుకు 19 అంగుళాల వీల్స్ కార్గో అందాన్ని తీసుకువచ్చాయి. ఇంటీరియర్ లో 10.5 అంగుళాల లేదా 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఉండబోతుంది. 7 అంగుళాల డిజిటల్ స్క్రీన్ చూడొచ్చు. వీటితోపాటు వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ప్రీమియం సౌండ్ సిస్టం వంటివి డ్రైవర్లతో పాటు వినియోగదారులకు సౌకర్యాన్ని అందిస్తుంది.

Also Read: Hyundai సంచలన నిర్ణయం.. త్వరలో మూడు అద్భుతమైన కార్లు.. వీటి ధరలు ఎలా ఉన్నాయంటే?

ఈ కారులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పవర్ ట్రెయిన్ ఇంజన్. ఇందులో 2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టం ను అమర్చారు. ఇందులో ఒకటి పెట్రోల్ ఇంజన్ కాక మరొకటి ఎలక్ట్రిక్ వేరియంట్ తో ఉంటుంది. ఈ ఇంజన్ 196 HP పవర్ అందిస్తుంది. ఈ ఇంజన్ కలిపి 20 నుంచి 25 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. అలాగే ఇందులో సేఫ్టీ ఫీచర్స్ కూడా ఎక్కువే అని చెప్పొచ్చు. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లైన్ కీప్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లతో అప్డేట్ చేయబడింది. అలాగే ఇందులో ADAS సూట్ కూడా చూడొచ్చు. దీనిని రూ.28 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular