spot_img
Homeబిజినెస్Tata new cars launch 2026: TATA నుంచి మూడు కొత్త కార్లు.. ఇందులో మీకు...

Tata new cars launch 2026: TATA నుంచి మూడు కొత్త కార్లు.. ఇందులో మీకు నచ్చేది ఉందా చూడండి..

Tata new cars launch 2026: వినియోగదారులకు అనుగుణంగా మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త కార్లు వస్తుంటాయి. అయితే నేటి తరం వారు డిఫరెంట్ ఆలోచనలతో ఉన్నారు. కొందరు సాంప్రదాయ హ్యాచ్ బ్యాక్ కారు కొనాలని చూస్తే.. మరికొందరు ఎస్ యూవీ కారు కొనాలని అనుకుంటున్నారు. ఇంకొందరు ఎలక్ట్రిక్ కారు కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఓ కంపెనీ మూడు కార్లను తీసుకొస్తుంది. లేటేస్ట్ టెక్నాలజీతో పాటు ఇంజన్ పవర్ ను మరింతగా అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకువస్తున్న ఈ కార్ల గురించి మీకోసం..

దేశంలో అత్యధికంగా కార్లు విక్రయాలు జరుపుకుంటున్న కంపెనీల్లో TATA రెండో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ నుంచి ఎక్కువగా SUVలు మార్కెట్లోకి వస్తుంటాయి. కానీ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేవిధంగా ఈ కంపెనీ ఇప్పుడు మూడు డిఫరెంట్ వేరియంట్ల కార్లను తీసుకురాబోతుంది.

టాటా కంపెనీ నుంచి ది బెస్ట్ సెల్లర్ కారుగా నిలిచింది టియాగో. ఈ కారును ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్ గా మార్చారు. ఈ కొత్తకారు హెడ్ ల్యాంప్స్ కొత్తగా ఉంటాయి. రీ డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ తో పాటు ఫ్రంట్ గ్రిల్ ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది. అలాగే ఇంటీరియర్ ఈ కారులో 19.2 కిలో వాట్ , 24 కిలో వాట్ బ్యాటరీలు ఉండనున్నాయి. వీటిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 223 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. నగర ప్రయాణికులతో పాటు లాంగ్ జర్నీ చేసే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది. మిగతా ఫీచర్లు ఇప్పటి వరకు ఉన్న టియాగో లాగే ఉంటాయి. హ్యాచ్ బ్యాక్ కారు కొనాలని అనుకునేవారు ఇప్పుడు దీనిని ఎలక్ట్రిక్ కారుగా పొందవచ్చు. దీనిని దీపావళి కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది.

Also Read: ఈ కారులో గ్యాస్ ఇంజన్ తో ఎలక్ట్రిక్ పవర్ జనరేట్.. డ్రైవర్లకు ఫుల్ సపోర్ట్..

టాటా నుంచి రాబోతున్నమరో కారు సియెర్రా ఈవీ. ఈ ఏడాది జూన్ లోపల మార్కెట్లోకి రాబోతున్న ఈ కారు పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్ లో కర్వ్వి ఈవీ, హారియర్ ఈవీతో సమానంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో 65 కిలోల పెద్ద బ్యాటరీని అమర్చనున్నారు. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇందులో బూట్ స్పేస్ ఎక్కువగా ఉండడంతో లాంగ్ జర్నీ చేసేవారికి అనుగుణంగా ఉంటుందని అంటున్నారు.

ప్రీమియం కారు కోసం ఎదురుచూసేవారికి టాటా కంపెనీ గుడ్ న్యూస్ చెబుతోంది. ఈ కంపెనీ నుంచి స్పోర్ట్ లుక్ తో ఎస్ యూవీ కారును తీసుకురాబోతుంది. టాటా అవిన్య ఈవీ పేరుతో రాబోతున్న దీని గురించి ఇప్పటికే ప్రస్తావించబడింది. ఇది టాటా జెన్ 3 ప్లాట్ ఫాం పై తయారు చేయబడుతోంది. ఎలక్ట్రిక్ ఫైడ్ మాడ్యులర్ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ కారు ధర రూ.35 లక్షలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 600 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper