Royal Enfield BS3 BS4: వాతావరణ కాలుష్యం, పెట్రోల్ ధరల కారణంగా వాహనాల్లో ఇంధన మార్పు కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న BS3, BS4 బైక్ ల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీటిని E20 కి మార్చాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొన్ని కంపెనీలు ఇప్పటికే ఉన్న తమ BS3, BS4 వాహనాలను E20 గా మారుస్తున్నాయి.BS3, BS4 బైక్ ల వల్ల రబ్బరు పైపులు సీల్స్ త్వరగా క్షీణిస్తాయి.మైలేజ్ కూడా తగ్గుతుంది. అయితే వీటి స్థానంలో E20 ఉండడంవల్ల వాతావరణ కాలుష్యం మెరుగ్గా ఉండడంతో పాటు మైలేజ్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే లేటెస్ట్ గా Royal Enfield కంపెనీ తమ BS3, BS4 వాహనాలకు E20 కిట్ లను అందజేయనుంది. ఇవి ఎలా ఉంటాయంటే?
2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం BS6 నిబంధనలు ప్రవేశపెట్టింది. ఈ నిబంధన ప్రకారం 20 ఏప్రిల్ ఒకటి నుంచి దేశంలో భారత్ స్టేజ్ సిక్స్ (BS6) తప్పనిసరిగా మారింది. ఆ తేదీ తర్వాత తయారీ, అమ్మకం, రిజిస్ట్రేషన్ అన్ని BS6 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఈ నిబంధనల ప్రకారం ప్రముఖ కంపెనీ Royal Enfield తన కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే బైక్ లు అన్ని BS6 గా మారిపోయాయి. అయితే అప్పటివరకు ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన BS3, BS4 వాహనాలకు E20 ఇంధనం వల్ల భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే ఈ వాహనాలు అప్గ్రేడ్ కొత్తగా E20 కిట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇలా అప్గ్రేట్ చేసిన కిట్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ 350, థండర్ బర్డ్ వాహనాలకు ఉపయోగపడనుంది. ఈ కిట్ లో సీల్స్, ట్యూబులు, 0 రింగ్ వంటివి ఉంటాయి. వీటిని పాత వాహనాల లో ఉండే వాటిపై రీప్లే చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ విధంగా రీప్లేస్ చేసిన తర్వాత అప్పుడు పాత వాహనాలు E20 కి అనుగుణంగా పనిచేస్తాయి. వీటి ధర రూ.1,700 గా నిర్ణయించారు. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కు చెందిన 500 సిసి బైక్ లకు ప్రత్యేకమైన E20 ఇట్లు లేవు. కానీ 350 కోసం అందుబాటులోకి వచ్చిన కిట్లను ఉపయోగించుకోవచ్చు. ఈ కిట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పాత వాహనాలు కూడా పర్యావరణ కాలుష్య రహితంగా మారిపోతాయి. అంతేకాకుండా ఇంధన వ్యవస్థ కూడా మెరుగుపడి బైక్ కు ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది. వీటిని పొందడానికి సమీపంలోని డీలర్ ను సంప్రదించి ఆ తర్వాత కొనుగోలు చేయాలని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.