Homeబిజినెస్10000mAh Battery Phone : ఏకంగా 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫోన్.. ధర చాలా ఛీప్..

10000mAh Battery Phone : ఏకంగా 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫోన్.. ధర చాలా ఛీప్..

10000mAh Battery Phone :  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోన్ లో బలమైన బ్యాటరీ ఉండడం చాలా అవసరం. ఎందుకంటే రోజంతా దాదాపు మొబైల్ లోనే గడపాల్సి వస్తోంది. అయితే కొన్ని మొబైల్స్ లో బెస్ట్ ఫీచర్స్ ఉండి.. బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. దీంతో వినియోగదారులు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే బ్యాటరీ కెపాసిటీ పెంచితే మొబైల్ ధర పెరుగుతుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పోకో కంపొనీ కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. […]

10000mAh Battery Phone :  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోన్ లో బలమైన బ్యాటరీ ఉండడం చాలా అవసరం. ఎందుకంటే రోజంతా దాదాపు మొబైల్ లోనే గడపాల్సి వస్తోంది. అయితే కొన్ని మొబైల్స్ లో బెస్ట్ ఫీచర్స్ ఉండి.. బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. దీంతో వినియోగదారులు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే బ్యాటరీ కెపాసిటీ పెంచితే మొబైల్ ధర పెరుగుతుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పోకో కంపొనీ కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ ఫోన్ లో ఏకంగా 10,000 ఎంఏహెచ్ బ్యాటరీని చేర్చారు. అయితే ఇందులో బెస్ట్ ఫీచర్స్ తో పాటు తక్కువ ధరలో అందుబాటలో ఉండబోతుంది. ఇంతకీ ఇది ఏ మొబైల్? ఎప్పుడు మార్కెట్లోకి రానుంది?

చైనా బ్రాండ్ పోకో లేటెస్ట్ గా కొత్త ఫోన్ ను సెప్టెంబర్ 4న మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని ఫ్లిఫ్ కార్ట్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. Poco x8 Power 5జీ పేరుతో వస్తున్న ఈ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో.. ఫ్లిప్ కార్టులో ప్రచురించిన పోస్టర్ ను భట్టి తెలుస్తోంది. ఈ కొత్త ఫోన్ లో 6.83 అంగుళాల ఏమోల్డ్ డిస్ ప్లే ఉండనుంది. దీంతో మూవీస్ చూసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది 1.5 కే రిజల్యూషన్ తో ఉండడంతో పాటు 120 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. అలాగే హెచ్ డీఆర్ 10 ప్లస్ సపోర్ట్ ఉండనుంది.

పోకో కొత్త ఫోన్ లో సాఫ్ట్ వేర్ విషయంలో ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ఇందులో హైపర్ ఓఎస్ 3 ఆధారిత ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ను అమర్చారు. అలాగే ఇందుల ఐపీ69 రేటింగ్ ఉండడంతో వాటర్ రిస్టన్స్ గా ఉండనుంది. ఇక ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉండడంతో వేగంగా పనిచేసేవారికి అనుగుణంగా ఉంటుంది. కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉండడంతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో డ్యూయెల్ కెమెరా ఉండనుంది. సెల్పీ కోసం 32 ఎంపీ సెల్పీ కెమెరా పనిచేయనుంది.

ఇక బ్యాటరీ గురించి చెబితే.. ఇందులో ఏకంగా 10,000 ఎంఏహెచ్ బ్యాటరీని చేర్చారు. ఈ బ్యాటరీ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయగా.. 27 వాట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. బ్లాక్, పర్పల్, క్లౌడ్ బ్లష్ కలర్లలో అందుబాటులో ఉండే ఈ మొబైల్ ధర అధికారికంగా ప్రకటించనప్పటికీ రూ.32,999గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper