Car Traffic Rules : కొత్త కారు కొనాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. అయితే తమ కారు ఆకర్షణీయంగా ఉండాలని అదనంగా కొన్ని పార్ట్స్ కొనాలని చూస్తుంటారు. వీటికి అదనంగా చార్జీలు అయినప్పటికీ.. షోరూం వాళ్లు చెప్పే కొన్ని మాటలకు పడిపోతారు. అయితే వీటి కొనుగోలు వల్ల కేవలం ఖర్చు మాత్రమే కాకుండా.. వాహన చట్టం నుంచి చర్యలు లేదా జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఎలాంటి వస్తువులు కొనాలి? ఏమి కొనవద్దు? అనే విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అంతేకాకుండా అనవసరపు వాటిని కొనుగోలు చేసి చిక్కుల్లో పడకుండా ఉండాలి. ఇంతకీ ఎలాంటి వస్తువులపై వాహన చట్టం ప్రకారం నిషేధం ఉంది? వాటిని కొంటే ఏం జరుగుతుంది?
కొంతమంది కారు వెనకాల తమకు ఏమైనా వారి గురించి రాస్తుంటారు. ఉదాహరణకు ‘డాడీ గిఫ్ట్’.. ‘మామ్ గిఫ్ట్’అని స్టిక్కర్ వేస్తుంటారు. అయితే ఇలా స్టిక్కర్ వేయించడం వల్ల వెనుక వచ్చే వాహనాలు పూర్తిగా కనిపించవు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి. అంతేకాకుండా ఇలాంటి స్టిక్కర్ వేస్తే వాహన చట్టంలోని 177 సెక్షన్ ప్రకారం జరిమానా విధిస్తారు. మరోవైపు డ్రైవర్ కు మిర్రర్ లో వెనుక దృశ్యాలను పూర్తిగా కనిపించవు. అందువల్ల ఇలాంటి స్టిక్కర్ వేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కారు లోపలికి ఎక్కేందుకు ప్రత్యేకంగా మెట్లు అనేవి ఉండవు. కానీ కొన్ని కార్లకు ఇటీవల ఫుట్ రెస్ట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి కారుకు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అంతేకాకుండా కారు లోపలికి వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటాయి. కానీ వీటివల్ల కారు బాలెన్స్ తప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా దీనిపై నిలబడితే కారు వన్ సైడ్ కు ఒరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా పక్కనుండి ఇతర వాహనాలు వెళ్తే వాటిని ఢీకొట్టే అవకాశం ఉంది.
ఇటీవల తమ కారు నెంబర్ ప్లేట్ స్టైల్ గా కనిపించాలని డిజైన్తో తయారు చేయిస్తున్నారు. మరికొందరు దానిపై అదనంగా స్టిక్కర్లు వేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పోలీసులు వాహనాలను సులువుగా గుర్తించలేక పోతారు. అంతేకాకుండా నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోతే ఒక్కోసారి జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. కారు ముందటి అద్దంపై కొందరు మ్యాగ్నెటిక్ కర్టైన్లు వేసుకుంటున్నారు. వీటివల్ల కాస్త ఎండ వేడిని తగ్గించుకోవచ్చని అనుకుంటున్నారు. అయితే కారు ముందటి రోడ్డును పూర్తిగా చూడడానికి ఇవి అడ్డంకిగా ఉంటాయి. అంతేకాకుండా మలుపులు తిప్పేటప్పుడు కూడా రోడ్డు సరిగ్గా కనిపించదు.
వాహనం ఆకర్షణీయంగా కనిపించడంతోపాటు ఎదుటి వాహనం తాకిడికి తట్టుకునేలా అదనంగా బంపర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటివల్ల ఎయిర్ బ్యాగ్స్ త్వరగా తెచ్చుకోకుండా ఉంటాయి. అంతేకాకుండా ట్రాఫిక్ లో ఇతర వాహనాలకు తగిలి ఇబ్బందిగా మారుతుంది. వీటిని ఏర్పాటు చేసుకుంటే మోటార్ వాహనం చట్టం ప్రకారం జరిమానా విధించే అవకాశం ఉంటుంది.