Homeబిజినెస్OnePlus N6: మొబైల్ పై వర్క్ చేసేవారికి సూపర్ బ్యాటరీ ఫోన్.. ధర చాలా ఛీప్..

OnePlus N6: మొబైల్ పై వర్క్ చేసేవారికి సూపర్ బ్యాటరీ ఫోన్.. ధర చాలా ఛీప్..

OnePlus N6: నేటి కాలంలో చాలా మంది మొబైల్ కొనే సమయంలో బ్యాటరీ పర్ఫామెన్స్ గురించి తెలుసుకుంటున్నారు. ఇలాంటి వారికి అనుగుణంగా కొన్ని కంపెనీలు మొబైల్స్ లో భారీ బ్యాటరీని చేర్చుతున్నారు. ఇందులో భాగంగా వన్ ప్లస్ (OnePlus) కంపెనీ తీసుకొచ్చే కొత్త మొబైల్ లో పవర్ ఫుల్ బ్యాటరీని చేర్చింది. దీంతో రోజూ మొబైల్ పై వర్క్ చేసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంతకీ ఇది ఏ ఫోన్? ఇందులో ఇంకేమీ ఫీచర్స్ ఉన్నాయి?

OnePlus కంపెనీ నుంచి కొత్తగా N6 అనే మొబైల్ రాబోతుంది. ఇందులో స్పెషల్ ఏంటేంటే.. ఇందులో 8000 mAh బ్యాటరీ ఉండడం. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగదారులకు మూడు రోజుల వరకు బ్యాకప్ వస్తుంది. దీనితో పాటు, మొబైల్ వేగంగా ఛార్జ్ అవ్వడానికి ఇందులో 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది కేవలం 47 నిమిషాల్లోనే బ్యాటరీని 50 శాతానికి కి ఛార్జ్ చేస్తుంది. అంతేకాకుండా, ఇందులో 5W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో ఈ మొబైల్ ద్వారా ఇతర చిన్న గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకోవచ్చు.

ఈ కొత్త మొబైల్ లో 6.8 అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఉండడం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ మోడల్స్ లాగే ప్రీమియం లుక్‌తో, వెనుక వైపు చతురస్రాకారపు కెమెరా మాడ్యూల్‌తో లభిస్తుంది.

OnePlus N6 సమర్థవంతమైన MediaTek Dimensity 6360 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీంతో గేమింగ్, మల్టీటాస్కింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో లార్జ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత సాఫ్ట్ వేర్ తో నడిచే ఈ మొబైల్.. సుమారు 5 సంవత్సరాల పాటు ఎటువంటి లాగ్స్ లేకుండా స్మూత్‌గా పనిచేస్తుందని వన్‌ప్లస్ హామీ ఇస్తోంది.

ఫోటోగ్రఫీ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా , సెల్ఫీల కోసం 8MP కెమెరా అందించారు. అలాగే ఈ కెమెరా ద్వారా 1080 పిక్సెల్ క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేయవచ్చు. AI ఫీచర్లు కూడా ఉన్న ఈ మొబైల్ దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP65 రేటింగ్‌ను కలిగి ఉంది. 4GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ రూ.22,999 ఉంది. అయితే దీనిని ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్ల ద్వారా తక్కువ ధరకే పొందవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper