Homeబిజినెస్OnePlus N6: మిడిల్ క్లాస్ పీపుల్స్ లక్ష్యంగా OnePlus కొత్త ఫోన్.. ధర ఎంతంటే..

OnePlus N6: మిడిల్ క్లాస్ పీపుల్స్ లక్ష్యంగా OnePlus కొత్త ఫోన్.. ధర ఎంతంటే..

OnePlus N6: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పటివరకు ప్రీమియం, మిడ్-రేంజ్ విభాగాల్లో OnePlus సంస్థ సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు సరికొత్త వ్యూహంతో లో బడ్జెట్ సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతోంది. మధ్యతరగతి వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా N సిరీస్‌లో భాగంగా వస్తున్న మొట్టమొదటి మొబైల్ ‘వన్‌ప్లస్ N6’ ను జూన్ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఫోన్ ఎలా ఉండబోతుందంటే?

వన్ ప్లస్ భారత మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు తన స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను మూడు స్పష్టమైన ధరల శ్రేణులుగా విభజించింది. ఇప్పటివరకు ఉన్న ప్రీమియం ఫ్లాగ్‌షిప్ సిరీస్ (రూ. 50,000), మధ్యతరగతికి చేరువైన నార్డ్ సిరీస్ (రూ. 25,000 నుంచి రూ. 50,000) లను తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు అత్యంత చౌకైన బడ్జెట్ విభాగంలో సరికొత్తగా ‘N సిరీస్’ ను ప్రవేశపెడుతోంది. ఈ కొత్త వ్యూహం ద్వారా మార్కెట్లో చాలా తక్కువ ధరలోనే వన్‌ప్లస్ బ్రాండ్ అనుభవాన్ని అందించాలని కంపెనీ భావిస్తోంది.

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. వన్‌ప్లస్ N6 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 18,000 నుంచి రూ. 25,000 లోపు బడ్జెట్ సెగ్మెంట్‌లో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ కన్నా తక్కువ ధరలో, ఒక నాణ్యమైన ప్రత్యామ్నాయంగా ఇది నిలవనుంది. ఈ ధరలో రియల్‌మి, రెడ్‌మి, iQOO బ్రాండ్ల బడ్జెట్ ఫోన్లకు వన్‌ప్లస్ N6 గట్టి పోటీనిచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

జూన్ 30న గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న ఈ వన్‌ప్లస్ N6 స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ (Amazon.in) తో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఈ బడ్జెట్ ఫోన్ల వినియోగదారులకు సేవలందించేందుకు వన్‌ప్లస్ తన కస్టమర్ సర్వీస్ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా 400 నుండి ఏకంగా 500 సెంటర్లకు విస్తరించింది. రోజువారీ అవసరాలకు బడ్జెట్ ధరలో ఒక బ్రాండెడ్ వన్‌ప్లస్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Tollywood Heroes Injuries

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
AP Local Body Elections

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...
AP BJP

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...
AP Government Door To Door Campaign

AP Government Door To Door Campaign: చేసింది చెప్పేందుకు…ఏపీలో 45 రోజుల కూటమి ప్రచారం!

AP Government Door To Door Campaign: ఏపీలో టీడీపీ కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ల పాలన ఉంది. తొలి రెండేళ్లు కూటమి పాలనపై సంతృప్తి శాతం అధికంగా...
Oktelugu Epaper