Oben Rorr Evo electric bike launch india: ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ బైక్స్ కొనుగోలుపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కంపెనీలు సైతం ఎక్కువగా విద్యుత్ వాహనాల ఉత్పత్తిపైనే ఆసక్తి చూపుతున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ Oben electric కంపెనీ ఓ కొత్త మోడల్ న్యూ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ బైక్ స్టైలిష్ గా ఉండడంతో పాటు ఆకర్షనీయమైన ధరకే రానుంది. అంతేకాకుండా ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్స్ ఉండడంతో నేటితరం యూత్ బాగా ఇష్టపడుతున్నారు. ఈ బైక్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Oben electric కంపెనీ నుంచి లేటెస్ట్గా Oben Rorr Evo అనే మోడల్ ను అందుబాటులో ఉంచారు. ఈ బైక్ లో బ్యాటరీ ప్యాక్ ప్రత్యేకంగా ఉండనుంది. ఇందులో 3.4 కిలోవాట్ LFP బ్యాటరీ ఉండనుంది. అలాగే ఇందులో 9 కిలో వాట్ వరకు పనిచేస్తుంది. సింగిల్ స్టేజ్ చైన్ డ్రైవ్ సిస్టంలో ఉపయోగించే ఈ ఇంజన్ వేగంగా వెళ్లే వారికి అనుకూలంగా ఉంటుంది. మూడు సెకండ్ల లోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంది. ఈ బ్యాటరీని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 180 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. అరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వరకు వేగంగా వెళ్లే ఇందులో టెక్నాలజీ తో కూడిన ఫీచర్లు ఉన్నాయి.
ఈ బైక్ లో 5 అంగుళాల TFT డిస్ప్లే ఉండనుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చే ఇందులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, రైడ్ డేటా, మెసేజ్ అలర్ట్, నావిగేషన్ మల్టీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే AI ఆధారిత రైడ్ మోడ్ సపోర్ట్ గా ఉండనుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే లాంగ్ డ్రైవ్ చేసేందుకు అనుగుణంగా ఉంటుంది. అలాగే ఇందులో సేఫ్టీ ఫీచర్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. యూనిఫైడ్ బ్రేక్ అసిస్ట్, డ్రైవర్ అలర్ట్ సిస్టం, జియో ఫెన్సింగ్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. రైడర్ కు సులభతారం చేసే విధంగా ఈ ఫీచర్లు ఉపయోగపడతాయి.
ఈ బైక్ ప్రస్తుతం రూ.1.25 లక్షల ధరతో ఉన్నప్పటికీ.. మొదటి 10,000 కస్టమర్లకు రూ. లక్ష కే అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే దీనిని బుక్ చేసుకోవాలంటే కేవలం రూ. 777 చెల్లిస్తే చాలు. మార్కెట్లోకి ఎక్కువగా ఎలక్ట్రిక్ బైక్స్ మస్తున్న తరుణంలో స్పోర్ట్స్ లుక్ కావడంతో పాటు యూత్ ను బాగా ఆకర్షించేలా ఈ బైక్ ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఇది పల్సర్ వలె స్టైల్ గా ఉండడంతో.. ఇది ప్రత్యేకంగా నిల్వనుంది.