Homeఆంధ్రప్రదేశ్‌Junior NTR Political Role: వైసీపీని గట్టెక్కించేది జూనియర్ ఎన్టీఆర్

Junior NTR Political Role: వైసీపీని గట్టెక్కించేది జూనియర్ ఎన్టీఆర్

Junior NTR Political Role: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి ఎలా ముందుకు వెళ్లాలో పాలుపోవడం లేదు. ప్రజా సమస్యలపై కంటే.. ప్రత్యర్థి నేతల వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతోంది ఆ పార్టీ. ఓటమి నుంచి ఎంత మాత్రం గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. ప్రధానంగా నారా లోకేష్ ఎదుగుదల ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకే […]

Junior NTR Political Role: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి ఎలా ముందుకు వెళ్లాలో పాలుపోవడం లేదు. ప్రజా సమస్యలపై కంటే.. ప్రత్యర్థి నేతల వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతోంది ఆ పార్టీ. ఓటమి నుంచి ఎంత మాత్రం గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. ప్రధానంగా నారా లోకేష్ ఎదుగుదల ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకే తమ అమ్ములపొద నుంచి మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తేవడం విశేషం. ఇప్పటికే తనపై రాజకీయ ముద్ర.. రాజకీయ నీడ పడకుండా జూనియర్ ఎన్టీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయ అంశాలను పట్టించుకునే పరిస్థితిలో లేరు. ప్రధానంగా సినిమాలపై దృష్టి పెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాల్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పేరును ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోంది.

* లోకేష్ ప్రారంభంలో కూడా అదే..
గతంలో లోకేష్ తెలుగుదేశం పార్టీలో వీక్ గా ఉన్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. అప్పట్లో సొంత పార్టీ శ్రేణులు కూడా లోకేష్ కు బదులు జూనియర్ ఎన్టీఆర్ ను తెస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. అప్పట్లో లోకేష్ ఆహార్యం బాగా ఉండేది కాదు. ఆయన అనుభవం కూడా అంతంత మాత్రమే. వాక్చాతుర్యం కూడా లేకుండా పోయేది. అటువంటి సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ను తెస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని టిడిపిలో కల్పించిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది. అంతకుమించి నందమూరి కుటుంబాన్ని తొక్కేస్తున్నారు అని ప్రజల మధ్యకు తీసుకెళ్లడమే ఆ పార్టీ ముఖ్య ఉద్దేశం. తెలుగుదేశం పార్టీకి అసలు సిసలు వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విస్తృత ప్రచారం చేసింది అప్పట్లో.

* ఎదుగుదల చూసి తట్టుకోలేక..
అయితే ఇప్పుడు లోకేష్ ఊహలకు అందని విధంగా.. అంచనాలకు అందని విధంగా అభివృద్ధి చెందారు ఆయన ఇప్పుడు స్టేట్ లీడర్ కాదు. నేషనల్ లీడర్ గా పరిణితి సాధించారు. ప్రస్తుతం ఒక స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తెస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. లోకేష్ నాయకత్వం సరే. 2029 ఎన్నికల్లో టిడిపి ఓడిపోతే లోకేష్ బదులు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ నాయకత్వం వహిస్తారని కొత్త ప్రచారం మొదలుపెట్టింది. లోకేష్ అంటే ఈర్ష్యతో పాటు ఒక రకమైన ఆందోళన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది. ఆయన పనితీరుపరంగా వెనుకబడి ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తెచ్చారు. ఆయన ఇప్పుడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు చూస్తుంటే వైసీపీని గట్టి ఎక్కించేది జూనియర్ ఎన్టీఆర్ అనేది స్పష్టంగా తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper