Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu: వెనుకబడిన వర్గాలకు.. చంద్రన్న చేయూత.. 34% టికెట్లు వాళ్లకే..

Chandrababu Naidu: వెనుకబడిన వర్గాలకు.. చంద్రన్న చేయూత.. 34% టికెట్లు వాళ్లకే..

Chandrababu Naidu: ఏపీ రాజకీయాలలో బీసీల ప్రాతినిధ్యం మరోసారి చర్చకు దారితీస్తోంది. వెనుకబడిన వర్గాలకు రాజకీయ అవకాశాలు పెంచే లక్ష్యంతో టీడీపీ కీలక ప్రకటన చేసింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున వెనుకబడిన వర్గాలకు 34 శాతం టికెట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. జయహో బిసి.. జనాభాలో సగం.. కూటమిచ్చింది బలం అనే నినాదంతో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాజకీయ ప్రాతినిధ్యం పై దృష్టి ఏపీ రాష్ట్ర […]

Chandrababu Naidu: ఏపీ రాజకీయాలలో బీసీల ప్రాతినిధ్యం మరోసారి చర్చకు దారితీస్తోంది. వెనుకబడిన వర్గాలకు రాజకీయ అవకాశాలు పెంచే లక్ష్యంతో టీడీపీ కీలక ప్రకటన చేసింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున వెనుకబడిన వర్గాలకు 34 శాతం టికెట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. జయహో బిసి.. జనాభాలో సగం.. కూటమిచ్చింది బలం అనే నినాదంతో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

రాజకీయ ప్రాతినిధ్యం పై దృష్టి

ఏపీ రాష్ట్ర జనాభాలో బడుగు బలహీన వర్గాల వాటా.. రాజకీయ ప్రాతినిధ్యం.. స్థానిక సంస్థలలో అవకాశాలపై చాలా కాలంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా 34% టికెట్లు ఇస్తామన్న ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక సంస్థల్లో వెనుకబడిన కులాలకు చెందిన అభ్యర్థులకు అవకాశాలు కల్పించడం ద్వారా రాజకీయాల్లో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచాలి అనేది చంద్రబాబు లక్ష్యం.. అయితే పార్టీ టికెట్ల కేటాయింపు.. చట్టపరమైన రిజర్వేషన్లు రెండు వేరువేరు అంశాలు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలు.. న్యాయస్థానాల తీర్పులు.. సంబంధిత చట్టాలు.. ప్రభుత్వ నిర్ణయాలకు లోబడి ఉంటాయి. అందువల్ల టిడిపి ప్రకటించిన టికెట్లు కేటాయింపు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.

రాజకీయంగా వేడి

స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ అంశం రాష్ట్ర రాజకీయాలలో మరోసారి వేడిని పెంచుతోంది. రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు తెరపైకి రావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శ కొనసాగుతున్నాయి. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలంటే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలని కూటమినేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో వైసిపి వైఖరి పై టిడిపి నేతలు అనేక రకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్ ఎన్టీఆర్ నుంచి

సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి వెనుకబడిన తరగతుల రాజకీయ ప్రాతినిధ్యం కోరుకునేవారు. టిడిపి ఆవిర్భావం నాటి నుంచి కూడా వెనుకబడిన వర్గాలకే ప్రాతినిధ్యం అందించింది. ఇదే అంశాన్ని టిడిపి నాయకులు తరచు ప్రస్తావిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం టికెట్లు కేటాయిస్తామని ప్రకటన కూడా అదే కోవలోకి వస్తుందని టిడిపి నేతలు అంటున్నారు. వెనుకబడిన తరగతుల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడం.. స్థానిక సంస్థల్లో వారికి అవకాశాలు కల్పించడం అంటే అంశాలు రాష్ట్ర రాజకీయాలలో ప్రాధాన్యం కలిగిస్తున్నాయి. టిడిపి ప్రకటించిన 34% టికెట్ల విధానం బీసీల ఉన్నతికి తోడ్పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper