Homeబిజినెస్Iphone Air: ఇది మామూలు ఆఫర్ కాదు.. త్వరపడండి బంగారం లాంటి ఐఫోన్ చౌక ధరలో..

Iphone Air: ఇది మామూలు ఆఫర్ కాదు.. త్వరపడండి బంగారం లాంటి ఐఫోన్ చౌక ధరలో..

Iphone Air: మామూలుగా అయితే ఐఫోన్ విపరీతమైన ఖరీదుగా ఉంటుంది. అందువల్లే ఒక వర్గం వారు మాత్రమే ఆ కంపెనీ ఫోన్ లను కొనుగోలు చేస్తుంటారు. ఇంకా కొందరు ఆ ఫోన్లను సొంతం చేసుకోవడానికి క్రెడిట్ కార్డులు.. ఇంకా రకరకాల పద్ధతులను ఆశ్రయిస్తుంటారు. చరిత్రలో తొలిసారిగా ఐఫోన్ మీద భారీ తగ్గుదల ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 వేల తగ్గింపు ప్రకటించింది యాపిల్. సాధారణంగా తన ఉత్పత్తులపై యాపిల్ కంపెనీ ధరలను ఏమాత్రం […]

Iphone Air: మామూలుగా అయితే ఐఫోన్ విపరీతమైన ఖరీదుగా ఉంటుంది. అందువల్లే ఒక వర్గం వారు మాత్రమే ఆ కంపెనీ ఫోన్ లను కొనుగోలు చేస్తుంటారు. ఇంకా కొందరు ఆ ఫోన్లను సొంతం చేసుకోవడానికి క్రెడిట్ కార్డులు.. ఇంకా రకరకాల పద్ధతులను ఆశ్రయిస్తుంటారు. చరిత్రలో తొలిసారిగా ఐఫోన్ మీద భారీ తగ్గుదల ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 వేల తగ్గింపు ప్రకటించింది యాపిల్.

సాధారణంగా తన ఉత్పత్తులపై యాపిల్ కంపెనీ ధరలను ఏమాత్రం తగ్గించదు. మార్కెట్లో డిమాండ్ తగ్గినప్పుడు మాత్రమే ధరల విషయంలో కాస్త వెసలుబాటు కల్పిస్తుంది. అయితే ఇప్పుడు యాపిల్ కంపెనీ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తూ తన ఉత్పత్తి మీద భారీగా ధర తగ్గించింది.

యాపిల్ కంపెనీ ఐఫోన్ ఎయిర్ పేరుతో ఒక మోడల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర 1,19,900. దీనిని ఇప్పుడు అమెజాన్ ఇండియాలో ఏకంగా 99 వేలకు విక్రయిస్తోంది. 20,900 రూపాయలను తగ్గించి అమ్ముతోంది. వినియోగదారులకు ఐఫోన్ ఎయిర్ కొనుగోలుపై క్రెడిట్ కార్డు మీద 4000 వరకు తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. మొత్తంగా 24,900 రూపాయలను తగ్గింపు ద్వారా పొందవచ్చు.

ఐఫోన్ ఎయిర్ స్పేస్ బ్లాక్, లైట్ గోల్డ్, క్లౌడ్ వైట్, స్కై బ్లూ వంటి నాలుగు రంగుల్లో లభిస్తుంది. ఈ మోడల్ 6.5 అంగుళాల ఎల్టిపిఓ సూపర్ రెటీనా ఈ ఎక్స్ డి ఆర్ ఓ ఎల్ ఈ డి డిస్ప్లే తో లభిస్తుంది. 300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో లభ్యమవుతుంది. ఇందులో యాపిల్ సైకో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది. అంతేకాకుండా ఏ19 ప్రో చిప్ సెట్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఎయిర్ మోడల్ 26 ఆపరేటింగ్ సిస్టం మీద ఆధారపడి పని చేస్తూ ఉంటుంది. ఇందులో ప్రాథమిక వేరియంట్ 12gb ర్యామ్, 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. కెమెరా కూడా సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడి ఉంటుంది. ఇందులో 48 రియల్ మెగాపిక్సల్ సెంటర్ స్టేజ్ షూటర్ ఉంటుంది. సెల్ఫీలు మాత్రమే కాదు వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో 18 మెగాపిక్సల్ ఫ్రంట్ స్నాపర్ అందుబాటులో ఉంటుంది. బ్యాటరీ ని వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చార్జ్ చేయవచ్చు. ఇందులో 3149 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వైర్ మాగ్ సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper