Homeఎంటర్టైన్మెంట్BB Jodi 2 elimination: కొరియోగ్రాఫర్ తో స్టేజి మీద కొట్లాట..'BB జోడి 2' నుండి...

BB Jodi 2 elimination: కొరియోగ్రాఫర్ తో స్టేజి మీద కొట్లాట..’BB జోడి 2′ నుండి డెమోన్ పవన్, రీతూ చౌదరి అవుట్!

BB Jodi 2 elimination: ‘బిగ్ బాస్ 9’ లో క్యూట్ జోడిగా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న జంట డిమోన్ పవన్, రీతూ చౌదరి. సీజన్ ప్రారంభం లో వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ చూసిన ఆడియన్స్ కి ఇదేమి క్రింజ్ రా బాబు అని అనుకున్నారు. కానీ కీలక సమయాల్లో వీళ్లిద్దరు ఒకరి కోసం ఒకరు స్టాండ్ తీసుకున్న విధానం, వివిధ సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ఎమోషన్స్ ని చూసి […]

BB Jodi 2 elimination: ‘బిగ్ బాస్ 9’ లో క్యూట్ జోడిగా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న జంట డిమోన్ పవన్, రీతూ చౌదరి. సీజన్ ప్రారంభం లో వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ చూసిన ఆడియన్స్ కి ఇదేమి క్రింజ్ రా బాబు అని అనుకున్నారు. కానీ కీలక సమయాల్లో వీళ్లిద్దరు ఒకరి కోసం ఒకరు స్టాండ్ తీసుకున్న విధానం, వివిధ సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ఎమోషన్స్ ని చూసి ఫిదా అయిపోయారు. వీళ్ళు కంటెంట్ కోసం ఎలాంటి డ్రామాలు ఆడడం లేదు, వీళ్ళ మధ్య ఉన్నది నిజమైన రిలేషన్ అని అందరూ నమ్మారు. బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్లిద్దరు అదే రిలేషన్ ని మైంటైన్ చేస్తూ వచ్చారు. ఇది ఇలా ఉండగా ‘బిగ్ బాస్ 9’ పూర్తి అయిన వెంటనే స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘BB జోడి 2’ లో జోడీగా వీళ్లిద్దరు వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు.

ఇద్దరు డ్యాన్స్ ఇరగదీస్తారని అందరూ ఆశిస్తే, యావరేజ్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తోనే ఇప్పటి వరకు లాక్కొచ్చారు. ముఖ్యంగా డెమోన్ పవన్ బాగా డ్యాన్స్ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అతను రీతూ చౌదరి కంటే తక్కువ డ్యాన్స్ వీస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిన్నటి ఎపిసోడ్ చివర్లో టెలికాస్ట్ అయిన ప్రోమో ని మీరంతా చూసే ఉంటారు. ఈ ప్రోమో లో వీళ్లిద్దరి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ పై జడ్జీలు, తోటి కంటెస్టెంట్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో రీతూ చౌదరి ఇలాంటి కామెంట్స్ వస్తాయని నేను ముందుగానే ఊహించాను, ఎందుకంటే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే మా కొరియోగ్రాఫర్ కి ఇది వర్కౌట్ అవ్వదని చెప్పాను, కానీ ఆయన వినలేదు, అందుకే ఇలాంటి ఔట్పుట్ వచ్చింది అని అంటుంది రీతూ చౌదరి.

దీంతో యాంకర్ ప్రదీప్ ఆ కొరియోగ్రాఫర్ ని స్టేజి మీదకు పిలుస్తాడు. రీతూ ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదని చెప్పినా కూడా మీరు చేశారట, కారణం ఏంటి అని అడగ్గా, అందుకు ఆ కొరియోగ్రాఫర్ సమాధానం చెప్తూ ‘వాళ్లిద్దరూ నాకు సమయం ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన తక్కువ సమయం లో ఎంత చెయ్యొచ్చో, అంతే చేశాను. వాళ్ళు సమయం ఎక్కువ ఇచ్చి ఉండుంటే ఈ కాన్సెప్ట్ ని చాలా బాగా చేసి ఉండేవాడిని’ అని అంటాడు. ఇలా కంటెస్టెంట్స్ ఒక కొరియోగ్రాఫర్ పై అసంతృప్తి వ్యక్తం చేయడం అనేది ఇప్పటి వరకు మనం హిస్టరీ లో ఏ డ్యాన్స్ షోలో కూడా చూసి ఉండము. రీతూ చౌదరి ఈ షోలోకి అడుగుపెట్టినప్పటి నుండి ఇలాగే మాట్లాడుతోంది. డ్యాన్స్ సరిగా చేయరు, తోటి కంటెస్టెంట్స్ ఇచ్చే తక్కువ మార్కులను కూడా తీసుకోలేరు,ఇలాంటి కంటెస్టెంట్స్ ని ఈమధ్య కాలంలో ఎక్కడా చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, ఈ వారం టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్స్ లో ఎలిమినేట్ అయ్యేది వీళ్లేనట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper