Homeహెల్త్‌egg eating mistakes: గుడ్డు తినేటప్పుడు ఈ తప్పులు చేయకండి..

egg eating mistakes: గుడ్డు తినేటప్పుడు ఈ తప్పులు చేయకండి..

egg eating mistakes: మనం రోజు తినే ఆహారంలో ప్రోటీన్లు కలిగిన పదార్థాలు ఉండడం చాలా అవసరం. ఇలాంటి వాటిలో కోడిగుడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కోడిగుడ్డులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీనిని ప్రతిరోజు ఒకటి లేదా రెండు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది. అయితే కోడి గుడ్డును క్రమ పద్ధతిలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. నిర్లక్ష్యం చేస్తే అనారోగ్యాల పాలయ్యే […]

egg eating mistakes: మనం రోజు తినే ఆహారంలో ప్రోటీన్లు కలిగిన పదార్థాలు ఉండడం చాలా అవసరం. ఇలాంటి వాటిలో కోడిగుడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కోడిగుడ్డులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీనిని ప్రతిరోజు ఒకటి లేదా రెండు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది. అయితే కోడి గుడ్డును క్రమ పద్ధతిలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. నిర్లక్ష్యం చేస్తే అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉందని కొందరు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు కోడిగుడ్డు తినేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు?

కోడి గుడ్డును ఆఫ్ బాయిల్డ్ కంటే బాయిల్డ్ చేసి తినడమే ఆరోగ్యకరం. అయితే గుడ్డును ఉడికించేటప్పుడు తెల్ల సోనా, దీని లోపల ఉండే పచ్చ సోనా బాగా ఉడికేలా చూసుకోవాలి. కొన్నిసార్లు సగం ఉడికిన కోడి గుడ్డును తింటూ ఉంటారు. ఇలాంటి వాటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీటిని పిల్లలకు తినిపించడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఏర్పడి అనారోగ్యానికి గుర అయ్యే ప్రమాదం ఉంది.

చాలామంది పచ్చి గుడ్డును పగలగొట్టి తినడం వల్ల ఎక్కువగా ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. కానీ ఇలాంటి గుడ్డును తినడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత అనేక రసాయనాలు తయారు చేసి కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

కొంతమంది ఉడికించిన గుడ్లను ఎక్కువసేపు బయట వస్తారు. ఇలా ఉంచడం వల్ల త్వరగా పాడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పుడ తినాలని అనుకుంటాము అప్పుడే గుడ్లను ఉడికించి తిని వేయడం మంచిది. ఉడికించిన కోడిగుడ్లను శుభ్రమైన వాతావరణంలో ఉంచాలి. వీటిపై బ్యాక్టీరియా చేరితే అవి నేరుగా శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కొన్ని కోడిగుడ్లు రంగు మారి ఉంటాయి. లేదా ప్రత్యేకమైన స్మైల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. వాటిని దూరంగా ఉంచడమే మంచిది.

గుడ్లను కొనేటప్పుడు వాటి పెంకులను పరిశీలించాలి. కొందరు పగిలిన గుడ్లను తక్కువ ధరకే విక్రయిస్తామని చెబుతారు. అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఎందుకంటే ఈ పగిలిన గుడ్లలో అనారోగ్యాన్ని కలిగించే క్రిములు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా గుడ్డు శరీరానికి పోషకాహారం అయినప్పటికీ దానిని తీసుకునే విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper