Homeబిజినెస్Gold Rates Today : బంగారం కొనుగోలుదారుల నిరాశ.. ఎందుకంటే?

Gold Rates Today : బంగారం కొనుగోలుదారుల నిరాశ.. ఎందుకంటే?

అంతర్జాతీయంగా బంగారం ధరలు స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2155 డాలర్లుగా ఉంది. సిల్వల్ 25.09 డాలర్ల వద్ధ స్థిరంగా కొనసాగింది. దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: వారం రోజులుగా పెరిగిన బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉండి సోమవారం స్వల్పంగా తగ్గాయి. అయితే గరిష్ట స్థాయిలో పెరిగి.. సల్పంగా తగ్గడంపై వినియోగదారులు నిరాశతో ఉన్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2155 డాలర్లుగా ఉంది. సిల్వల్ 25.09 డాలర్ల వద్ధ స్థిరంగా కొనసాగింది. దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. మార్చి 18న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,580గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.66,090 గా ఉంది. మార్చి16న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,590తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి ఆదివారంతో పోలిస్తే సోమవారం రూ.10 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,730ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.66,240గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,580 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.66,090 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.61,140 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,700తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.60.580 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,090తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.60,580తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,090తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.77,200గా నమోదైంది.ఆదివారంతో పోలిస్తే సోమవారం రూ.100 తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.77,200గా ఉంది. ముంబైలో రూ..77,200, చెన్నైలో రూ.80,200, బెంగుళూరులో 76,000, హైదరాబాద్ లో రూ.80,200తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper