Rear Seat Belt Alarm: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది వేలాది మంది చనిపోతున్నారు. అంతే సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు.. ప్రభుత్వం ఎన్ని రకాల రవాణా నిబంధనలు తీసుకొచ్చినప్పటికీ ప్రమాదాలు తగ్గడం లేదు. ఈ ప్రమాదాల వల్ల ప్రభుత్వంపై కూడా తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. ఈ క్రమంలో వాటి నివారణకు కేంద్రం సరికొత్త నిబంధనలను తెరపైకి తీసుకువచ్చింది.
గత ఏడాది రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మేస్త్రి దుర్మరణం చెందాడు. ఆయన వెంట కారులో ప్రయాణిస్తున్న మరో పారిశ్రామికవేత్త కూడా మృతి చెందాడు. సైరస్ మాత్రమే కాకుండా చాలామంది ప్రముఖులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నారు. సామాన్యులకైతే లెక్కేలేదు.. ఈ నేపథ్యంలో కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ రోడ్డు ప్రమాదాల నివారణ పై దృష్టి సారించింది. ఇప్పటికే డ్రైవర్ తో పాటు ముందు సీట్ల కూర్చున్న సహ ప్రయాణికుడికి సీట్ బెల్ట్, 6- ఎయిర్ బ్యాగ్ స్ కచ్చితం చేసింది. ఇప్పుడు తాజాగా వెనక సీట్ లో కూర్చున్న వారు కూడా బెల్టు పెట్టుకునేలా ఏర్పాటు చేసింది. ఆ బెల్ట్ పెట్టుకోకుంటే అలారం వినిపించేలాగా ఏర్పాట్లు చేయనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి అలారం తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణా శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది విక్రయించే అన్ని కార్లలోనూ రేర్ సీట్ బెల్ట్ అలారం తప్పనిసరిగా వాహన తయారీదారులు ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే ఆటోమొబైల్ సంస్థలకు కేంద్ర రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.. ఒకవేళ జాతీయ రహదారులపై వెళ్తున్నప్పుడు వెనుక సీట్ల కూర్చున్న ప్రయాణికుడు సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే అలారం మోగుతూనే ఉంటుంది. సీట్ బెల్ట్ ధరించిన తర్వాతే అలారం ఆగిపోతుంది.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం డ్రైవర్, అతని పక్కన కూర్చున్న సహప్రయాణికుడికి మాత్రమే ఇన్ బిల్ట్ సీట్ బెల్ట్ రిమైండర్ ఉండేది. రేర్ సీట్ ప్యాసింజర్లు సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే ఇకపై సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ లోని 138(3) సెక్షన్ కింద 1000 వరకు అపరాధ రుసుం విధిస్తారు. రేర్ సీట్లో కూర్చున్న టాటా గ్రూప్స్ మాది చైర్మన్ సైరస్ మిస్త్రీ, ఆయన స్నేహితుడు జహంగీర్ పండులే గత ఎడల జరిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. దీంతో రేర్ సీట్ బెల్ట్ రిమైండర్ తప్పనిసరి చేస్తూ కేంద్రం విధివిధానాలను డ్రాఫ్ట్ రూపంలో ప్రకటించింది.