Homeబిజినెస్MG Majestor: టయోటా ఫార్చ్యూనర్ ను హడలెత్తించేందుకు వస్తున్న ఈ కారు గురించి తెలుసా...?

MG Majestor: టయోటా ఫార్చ్యూనర్ ను హడలెత్తించేందుకు వస్తున్న ఈ కారు గురించి తెలుసా…?

MG Majestor: SUV సెగ్మెంట్ లో ఇప్పటివరకు చాలా కార్లు వచ్చాయి. కానీ MG Motors నుంచి SUV కొత్త కారు Majester వినియోగదారులను ఆకర్షించేందుకు త్వరలో ఇండియన్ మార్కెట్లోకి రాబోతుంది. ఇప్పటికే వివిధ దేశాల్లో రిలీజ్ అయిన ఈ కారు వచ్చే మేలో భారత రోడ్లపై తిరగనుంది. అయితే ఇందులో ఉండే ఫీచర్స్, ఇంజన్ పనితీరు తో పాటు టెక్నాలజీని చూసిన చాలామంది ఈ కారు పై ఆసక్తి చూపుతున్నారు. టర్బో డీజిల్ ఇంజన్ తో పాటు లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన ఫీచర్లు ఉండడం ఈ కారు ప్రత్యేకతను పొందుతోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే…

MG కొత్త కారు Majester లో ఇంటీరియర్ ఫీచర్స్ లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నాయి. ఇందులో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డ్రైవర్ డిస్ప్లే సౌకర్యవంతంగా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ తో పాటు వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఉండనున్నాయి. 12 స్పీకర్ JBL ఆడియో తో పాటు 64 యాంబియంట్ లైటింగ్ చేర్చారు. ఈ కారులో 2.0 లీటర్ ట్విన్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజన్ ఉండనుంది. ఇది 215 హెచ్పి పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 478 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో పనిచేసే మైలేజ్ విషయంలో కూడా అనుగుణంగా ఉంటుంది. దీని ఎక్స్టీరియర్ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. Maxes D90 కంటే విభిన్నంగా కనిపిస్తూ విశాలంగా ఉంటుంది. ఈ కారు LED DRL లు ఇంటిగ్రేట్ చేయబడిన బంపర్ లో ఫిక్స్ చెయ్ ఉంటాయి. 19 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఫిక్స్డ్ సైడ్ స్టెప్పు లు కారు లోపలికి, బయటకు రావడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. పై భాగంలో ఉన్న రూప్ బార్ LED ఎలిమెంట్ ను కలిగి ఉంటుంది. పూర్తిగా వెడల్పుతో టెయిల్ టైల్ డిజైన్ ఆకట్టుకుంటుంది.

మొత్తం ఆరు సీట్ల లేఅవుట్ తో ఉన్న ఇందులో ఏడుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా వెళ్లవచ్చు. లోపల విశాలమైన స్పేస్ ఉండడంతో దూర ప్రయాణం చేసిన ఎలాంటి అలసట ఉండదు. ఇందులో ఉండే డ్యూయల్ వైర్లెస్ చార్జింగ్ ప్యాడ్లు డ్రైవర్తోపాటు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటాయి. అలాగే అవుట్ సైడ్ రివర్ వ్యూ మిర్రర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్టు, surround వ్యూ కెమెరా భద్రతను అందిస్తాయి. 2026 మే నెలలో ఈ కారు డెలివరీ ప్రారంభం కానుంది. అయితే దీనిని బుక్ చేసుకునేందుకు రూ.41,000 డౌన్ పేమెంట్ ను నిర్ణయించారు. ధరల విషయంపై ఏప్రిల్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్. ఇది మార్కెట్లోకి వస్తే టయోటా ఫార్చ్యూనర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper