Best Mileage Bikes In India 2026: రోజువారి అవసరాలతో పాటు ఉద్యోగులకు తప్పనిసరిగా బైక్ ఉండాలి. అయితే చాలామంది తమ అవసరాల దృష్ట్యా బడ్జెట్లో వాహనాన్ని కొనుగోలు చేయాలని చూస్తారు. ఇదే సమయంలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కోసం ఆరా తీస్తారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా మైలేజ్ నీ దృష్టిలో ఉంచుకొని వాహనాలను తయారు చేశాయి. ఇవి ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి అలరిస్తున్నాయి. చాలామంది ట్యాంక్ ఫుల్ చేయాలనుకునేవారు ఈ బైక్స్ ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 800 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. మరి అలాంటి బైక్స్ ఏవో ఇప్పుడు చూద్దాం..
మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా బడ్జెట్లోనే బైక్ కొనాలని చూస్తారు. ఇలాంటి వారికి అనుగుణంగా Bajaj కంపెనీ CT 100 X బెస్ట్ ఎంపిక అని అంటున్నారు. ఈ బైక్ వన్ వన్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ సిసి ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది లీటర్ ఇంధనానికి 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. స్మార్ట్ లుక్ లో కనిపించే ఈ బైక్ చిన్న వ్యాపారులకు, ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఇదే కంపెనీకి చెందిన ప్లాటినా 100 బైక్ కూడా ఎక్కువగా మైలేజ్ ఇచ్చేదిగా పేర్కొంటున్నారు. ఇందులో 102 సిసి ఇంజన్ ఉండనుంది. ఇది లీటర్ ఇంధనానికి 75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో ట్యాంక్ ఫుల్ కావడానికి 11 లీటర్ల పెట్రోల్ అవసరం ఉంటుంది. అలా ఒక్కసారి ఫుల్ చేస్తే ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా ఈ బైక్ పై ప్రయాణం చేస్తే ఎలాంటి అలసట ఉండదు.
బజాజ్ కంపెనీకి చెందిన పల్సర్ 125 బైక్ యూత్ కు బాగా నచ్చుతుంది. ఎందుకంటే దీని డిజైన్ ప్రీమియం లుక్ తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అద్భుతమైన పికప్ ని ఇస్తుంది. దీనిపై ప్రయాణం చేస్తే స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటారు. ఈ బైక్ లీటర్ ఇండనానికి 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే ప్లాటినా 110 బైక్ కూడా గొప్ప మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ బైక్ లో 115.45 సిసి ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ లీటర్ ఇంధనానికి 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అయితే ఇందులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం ఉండడంతో దీనిపై ప్రయాణం చేసేవారు సేఫ్ గా ఉంటారు. ఇక బజాజ్ నుంచి మార్కెట్లోకి వచ్చిన పల్సర్ గురించి అందరికీ తెలిసిందే. ఈ బైక్ సైతం లీటర్ ఇంధనానికి 50 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఇందులో 125.4 సిసి ఇంజన్ ఉండనుంది.