spot_img
Homeబిజినెస్Yamaha Ray ZR Scooter: 71 కిలోమీటర్ల మైలేజీ.. టాప్ 10 జాబితాలో చోటు.. ఈ...

Yamaha Ray ZR Scooter: 71 కిలోమీటర్ల మైలేజీ.. టాప్ 10 జాబితాలో చోటు.. ఈ స్కూటర్ గురించి తెలిస్తే వెంటనే కొంటారు..

Yamaha Ray ZR Scooter: రోజువారి అవసరాలతో పాటు చిన్న చిన్న ప్రయాణాలకు స్కూటర్లు తప్పనిసరిగా మారాయి. ప్రస్తుత కాలంలో చాలా కంపెనీలు బైక్స్ కంటే స్కూటర్ లనే ఎక్కువగా తీసుకువస్తున్నాయి. సిటీలో ఉండే వారితోపాటు గ్రామాల్లో సైతం ఈ స్కూటర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కంపెనీలు పోటీపడి వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఫీచర్లను ఉంచుతున్నాయి. అయితే ఓ కంపెనీకి చెందిన స్కూటర్ లీటర్ ఇంధనానికి 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంతేకాకుండా దీని ధర కూడా 80,000 లోపే ఉండడం విశేషం. ఇంతకీ ఈ స్కూటర్ ఏ కంపెనీకి చెందింది? ఇందులో ఉండే ఫీచర్స్ ఏంటి?

Also Read: జగన్ కోసం రంగంలోకి ఆ ఇద్దరు!

భారతదేశంలో ఆకర్షణీయమైన బైక్స్ ను అందించడంలో Yamaha ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ కంపెనీ నుంచి యూత్ ఎప్పటికీ కొత్తదనం కోరుకుంటుంటారు. అయితే కేవలం బైక్స్ మాత్రమే కాకుండా స్కూటర్ల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దీని నుంచి మార్కెట్లోకి వచ్చిన Ray ZR అనే హైబ్రిడ్ స్కూటర్ విపరీతమైన సేల్స్ను నమోదు చేసుకుంటుంది. 2026 జనవరి ఒక్క నెలలో 19,815 యూనిట్లు అమ్ముడుపోయాయి. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది 40% వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. 2025 లో ఈ స్కూటర్ 15, 209 యూనిట్లు మాత్రమే విక్రయాలు జరుపుకుంది.

యమహా రేజెడ్ఆర్ ఇంతలా వృద్ధి సాధించడానికి కారణాలు లేకపోలేదు. ఈ స్కూటర్ ప్రత్యేకత ఏంటంటే ఎక్కువగా మైలేజ్ ఇవ్వడమే. ఇందులో 125 సిసి ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. దీంతోపాటు స్మార్ట్ మోటార్ జనరేటర్ పవర్ కూడా పనిచేస్తుంది. మొత్తంగా హైబ్రిడ్ ఇంజన్ తో ఈ స్కూటర్ లీటర్ ఇంధనానికి 71 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. నగరాల్లో ఎక్కువగా ప్రయాణం చేసేవారు.. ట్రాఫిక్ నుంచి బయటపడడానికి ఇది చాలా అనుగుణంగా ఉంటుంది. ఇందులో పవర్ కూడా ఉండడంతో పెట్రోల్ ఇంజన్ పై భారం తగ్గి ఇంధన పొదుపు ఉండే అవకాశం ఉంటుంది.

ఇందులో ఫీచర్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ.. స్మార్ట్ ఫోన్ తో నావిగేషన్ వంటివి ఉన్నాయి అలాగే ఫోన్ కాల్ అలర్ట్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ సౌకర్యవంతంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ స్కూటర్ ఎక్కడ పార్కింగ్ చేశామో తెలుసుకునే విధంగా అలర్ట్ చేస్తుంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ వంటివి కూడా రక్షణ ఇస్తుంది. ఈ స్కూటర్లో ఉండే సస్పెన్షన్తో రహదారులు ఎలా ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణం చేయవచ్చు. ఇక ఈ స్కూటర్ ధర రూ.76,700 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. కొత్తగా స్కూటర్ కొనాలని అనుకునే వారితోపాటు.. ఇంటి అవసరాలకు ప్రత్యేకంగా స్కూటర్ ఉండాలని అనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం యమహా రే జెడ్ ఆర్ టాప్ 10 స్కూటర్ జాబితాలో చోటు సంపాదించుకుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper