spot_img
Homeబిజినెస్Maruti Suzuki E Vitara: ఈ కారుకు విపరీతమైన బుకింగ్ ట్రాఫిక్.. డెలివరీ కోసం నెల...

Maruti Suzuki E Vitara: ఈ కారుకు విపరీతమైన బుకింగ్ ట్రాఫిక్.. డెలివరీ కోసం నెల ఆగాల్సిందే..

Maruti Suzuki E Vitara: దేశంలో అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటున్న కార్లలో Maruti Suzuki ముందుంటుంది. అయితే ఇటీవల EVల విక్రయాలు పెరిగిపోతుండడంతో మారుతి సుజుకి కంపెనీ మొదట్లో కొంత ఆందోళన చెందింది. అయితే ఆ తర్వాత దీని నుంచి కూడా EV ని తీసుకురావాలని నిర్ణయించి ఇటీవల మార్కెట్లో E Vitara ను ప్రవేశపెట్టారు. సాధారణంగానే మారుతి సుజికి కార్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందులో దీని నుంచి ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి వచ్చిందని తెలియగానే కొంతమంది వినియోగదారులు ఎగబడి కొంటున్నారు. ఇలా చాలామంది ఈ కారును బుక్ చేసుకోవడంతో వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ కారు కొనాలంటే ఎన్ని వారాలు వెయిట్ చేయాలో తెలుసా?

Also Read: జగన్ కోసం రంగంలోకి ఆ ఇద్దరు!

Maruti Suzuki కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చినా మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు E Vitara. ఈ కారు నేటితరం వారికి అనుగుణంగా ఫీచర్లను ఉంచడంతోపాటు తక్కువ ధరలో అందిస్తోంది. SUV వేరియంట్ లో ఉన్న దీని ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే.. ఎల్ఈడి హెడ్ లైట్స్, ఎల్ఈడి DRL వంటివి కారుకు అందాన్ని తీసుకువస్తాయి. అలాగే LED టెయిల్ లాంప్స్ కూడా ప్రీమియం లుక్ ను కలిగి ఉన్నాయి. దీనికి ఉండే 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ కారుకు ఫుల్ సపోర్ట్ గా ఉంటాయి. పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంటులో ఉన్న ఇందులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. వీటిలో ఒకటి 49 kWh కాగా.. మరొకటి 61 kWh తో పనిచేస్తుంది. ఈ రెండు బ్యాటరీల్లో మొదటిది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 440 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. రెండవది 543 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. లాంగ్ డ్రైవ్ చేసే వారికి ఈ మైలేజ్ పూర్తిగా అనుగుణంగా ఉంటుంది. అలాగే గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లోనూ కూడా ఇది సపోర్టుగా ఉంటుంది.

ఈ కారును పొందాలంటే కనీసం ఒకటిన్నర నెలలు ఆగాల్సిందే. ఎందుకంటే దీనికి డిమాండ్ రోజురోజుకు పెరుగుతుండడంతో బుకింగ్ ఆర్డర్లు పెరిగిపోతున్నాయి. SUV కోరుకునే వారితోపాటు ఎలక్ట్రిక్ వాహనం కావాలని అనుకునేవారు రెండు రకాల వినియోగదారులు దీనిని బుక్ చేసుకుంటున్నారు. అయితే ఈ విటారాను ఎక్కువగా లైక్ చేయడానికి ధర కూడా కారణం అని తెలుస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అయితే ఇటీవల దీనిని Battery As a Service అనే స్కీం కింద విక్రయిస్తున్నారు. దీని ప్రకారం ముందుగా దీనిని రూ.10.99 లక్షల కే కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రతి కిలోమీటర్ కు రూ.3.99 అద్దెను చెల్లించాల్సి ఉంటుంది. ప్రారంభంలో తక్కువ బడ్జెట్ తో కారు కొనాలని అనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Gautam Krishna

Gautam Krishna: మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కోసం ముగ్గురు డైరెక్టర్ల ఎదురుచూపు…

Gautam Krishna: రాజకుమారుడు సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో మహేష్ బాబు... ఆ తర్వాత క్లాస్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించిన...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు చేదు వార్త.. ఊరించి దెబ్బ తీశారుగా..

Mahesh Babu: ప్రతీ ఏడాది మహేష్ బాబు అభిమానులు , తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంత గ్రాండ్ గా జరిపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు...
Jana Nayagan Box Office Collection

Jana Nayagan Box Office Collection: ‘జన నాయగన్ ‘ కి డిజాస్టర్ టాక్.. కానీ మ్యాట్నీ షోస్...

Jana Nayagan Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం ,...
Bandla Ganesh

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక అయిపోయినట్టే..

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి సుప్రీం కోర్టు నుండి చాలా పెద్ద ఎదురుదెబ్బ నే తగిలింది. తనకు ఉన్నటువంటి స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేయడాన్ని సమర్థిస్తూ...
India vs Zimbabwe

India vs Zimbabwe: టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే: అయ్యర్ సేన మీదనే ఒత్తిడి.. ఎందుకంటే

India vs Zimbabwe:  తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఐర్లాండ్ ఆడింది. ఏకంగా రెండు మ్యాచ్లు గెలిచి.. టీమిడియాకు...
Oktelugu Epaper