Financial planning : కొందరికి ముందుచూపు ఉంటుంది. గుంపులో గోవిందం లాగా కాకుండా.. విభిన్నంగా బతకాలని కోరిక వారికి ఉంటుంది. వారి ఆలోచనలు.. ముందుచూపు.. సమస్యలను ఎదుర్కొనే తీరు.. అవన్నీ కూడా వారిని ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇటువంటివారు జీవితంలో ప్రయోగాలు చేస్తుంటారు.. ఆప్ ప్రయోగాలన్నీ కూడా తమకు అనుకూలంగా ఉండాలని బలంగా అడుగులు వేస్తుంటారు. కొన్ని తరాల వరకు తమ సామ్రాజ్యం చెక్కుచెదరకుండా ఉండేలా చేసుకుంటారు. ఇటువంటి వ్యక్తులను భిన్నమైన వారిగా సమాజంలో పేర్కొంటుంటారు. అటువంటి వ్యక్తే ఇతడు కూడా.
ఆ వ్యక్తి పేరు, ఇతర వివరాలు తెలిసినప్పటికీ న్యాయపరమైన చిక్కులున్న నేపథ్యంలో.. వాటిని ఇక్కడ ప్రస్తావించడం లేదు. అతడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. సరిగ్గా 19 సంవత్సరాల కి అతడికి ఉద్యోగం వచ్చింది. అప్పటికే అతడు చదువు పూర్తి చేసి సంవత్సరం కూడా కాకముందే ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. వేతనం కూడా పర్వాలేదని స్థాయిలో వస్తుండడంతో.. 1998లో మ్యూచువల్ ఫండ్, ఎస్ ఐ పీ మొదలుపెట్టాడు. అతని వేతనం పెరిగే కొలది 500 నుంచి 5000 వరకు ఎస్ఐపి చేశాడు. 30 ఏళ్లు అద్దెకు ఉన్న అతడు సాధారణ జీవితాన్ని గడిపాడు. 45 సంవత్సరాలకే రిటర్మెంట్ తీసుకొని.. జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నాడు. గతంలో అతడు పెట్టుబడి పెట్టిన వాటి నుంచి దాదాపు 4.7 కోట్ల వరకు వచ్చాయి. దీనికి తోడు ముందస్తుగానే పదవి విరమణ తీసుకోవడంతో అతడికి ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు కూడా భారీగానే లభించాయి. తద్వారా ఇప్పుడు అతడు దాదాపు 6 కోట్ల వరకు తన ఆస్తులను పెంచుకున్నాడు. ఇందులో రెండు కోట్లు తన వద్ద ఉంచుకుని.. మిగతా డబ్బును వివిధ పెట్టుబడి పథకాలలో పెట్టాడు.
వచ్చే పది సంవత్సరాలలో ఆ పెట్టుబడి పథకాల ద్వారా అతడికి రెట్టింపు లాభాలు వస్తాయి.. అ లాభాలతో అతడు మరో కొన్ని పథకాలలో పెట్టుబడులుగా పెడతాడు. మిగతా నగదును వివిధ ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తాడు. తద్వారా తన కుటుంబానికి మరింత ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తాడు. వాస్తవానికి ఈ వ్యక్తికి ఆర్థిక కార్యకలాపాల మీద మొదటి నుంచి అవగాహన చాలా ఎక్కువ. పైగా వివిధ పథకాల మీద అతనికి విపరీతమైన పట్టు ఉంది. ఎందులో పెట్టుబడి పెడితే లాభాలు బాగా వస్తాయో అతనికి పూర్తిస్థాయిలో ఐడియా ఉంది. అందువల్లే అతడు భారీగా లాభాలు వచ్చే పథకాలలో పెట్టుబడులు పెట్టాడు. 18 సంవత్సరాల కంటే ముందుగానే రిటర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు కుటుంబంతో సరదాగా ఉంటున్న అతడు.. వివిధ వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. తద్వారా తనకు వచ్చే వేతనానికంటే ఎక్కువగా సంపాదిస్తున్నాడు. అంతేకాదు కుటుంబంతో విహార యాత్రలకు కూడా వెళ్తున్నాడు. సరిగా పొదుపు చేస్తే 45 సంవత్సరాలకే రిటర్మెంట్ కావచ్చని అతడు నిరూపిస్తున్నాడు. 45 సంవత్సరాలకే అతడు రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు తోటి ఉద్యోగులు ఎగతాళి చేశారు. పిచ్చోడని హేళన చేశారు. ఇప్పుడు అతని ప్రణాళిక చూసి సలాం చేస్తున్నారు.