Homeఆంధ్రప్రదేశ్‌YCP MaVigun controversy: వైసీపీలో 'మావిగన్' చిచ్చు

YCP MaVigun controversy: వైసీపీలో ‘మావిగన్’ చిచ్చు

YCP MaVigun controversy: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి మావిగన్ రాజధాని ప్రతిపాదన కుదిపేస్తోంది. ముఖ్యంగా ఈ ప్రతిపాదన వెనుక సలహాదారులు ఉన్నారు అన్నది అనుమానం. అయితే అది ఎవరన్నది మాత్రం తెలియడం లేదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటివారు అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఐడియా అని మీడియా ముందుకు వచ్చి చెప్పారు. అయితే సజ్జల ప్రత్యేకంగా చెప్పడం వెనుక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా తాడేపల్లి కార్యాలయంలో జరిగిన పరిణామాల క్రమంలోనే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. సజ్జల వర్సెస్ చెవిరెడ్డి యుద్ధం ఈ వ్యవహారంతో పతాక స్థాయికి చేరినట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. ఈ వింతైన పేరు, ప్రతిపాదన వెనుక చెవిరెడ్డి వ్యూహం ఉందనే ప్రచారం జరగడంతో.. మావిగన్ నెపం తన పైకి రాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి జాగ్రత్త పడినట్లు కనిపిస్తున్నారు.

అప్పుడే చేసి ఉంటే.. మావిగన్( Mavigun )
ప్రతిపాదన అనేది ఇప్పుడు చేసేది కాదు. చంద్రబాబు అమరావతి ప్రతిపాదన చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఈ సూచన చేసి ఉంటే చాలా బాగుండేది. ఒకవైపు అమరావతి నిర్మాణం కొనసాగుతోంది. దానిని నిలిపివేసి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు తెచ్చారు. అమరావతి పనులను అడ్డుకొని దానిని ఒక స్మశానంతో పోల్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు పునః ప్రారంభం అయ్యాయి. ఇటువంటి సమయంలో జగన్ మావిగన్ ప్రతిపాదన ఫెయిల్యూర్ గా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత చూసి వైసిపి లోని ముఖ్య నేతలు అంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ప్రెస్ మీట్ లు పెట్టి ఈ వింత పేరును సమర్థిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదు అని భయపడ్డారు. అందుకే అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి లాంటి ఒకరిద్దరు మాత్రమే దీనిపై మాట్లాడారు. మరోవైపు సజ్జల చుట్టూ ఆరోపణలు రావడం, ఆయన ఇటువంటి చచ్చు సలహాలు ఇస్తారని సొంతవారే అనుమానించడంతో మీడియా ముందుకు వచ్చారు. మావిగన్ అనేది ఎవరి సలహా కాదు అని.. అది జగన్మోహన్ రెడ్డి స్వయం నిర్ణయం అని సత్తి చెప్పే ప్రయత్నం చేశారు.

చెవిరెడ్డి పై నెపం
మరోవైపు ఈ మావిగన్ సలహా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది అని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి. గత కొంతకాలంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కీలకం అవుతూ వస్తున్నారు. ఆయనే ఈ రాజధాని ప్రతిపాదనను నూరిపోసారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు పార్టీకి డ్యామేజ్ జరుగుతుండడం.. స్వయంగా పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తుండడంతో సజ్జల దానిని రెట్టింపు చేయాలనుకున్నారు. అందుకే ఈ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేశారు. పరోక్షంగా తన ప్రమేయం లేదని సంకేతాలు ఇచ్చి.. ఇదంతా చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని అనుమానం రేగేలా మాట్లాడారు.

సజ్జలకు తగ్గుతున్న ప్రాధాన్యం..
ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యతను తగ్గించాలని కొన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాడేపల్లిలో టాక్ వినిపిస్తోంది. సజ్జలను పార్టీ నుంచి సాగనంపేందుకు వైసిపి లోని ఒక బలమైన వర్గం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే రెండు మూడు నెలల్లో పార్టీలో సంచలనాత్మక మార్పులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. కొందరు నేతలను జగన్మోహన్ రెడ్డి దూరం పెడతారని కూడా టాక్ నడుస్తోంది. చుట్టూ కోటరితో పార్టీకి డ్యామేజ్ జరుగుతోందని.. ఇలా అయితే పార్టీలో కొనసాగడం కష్టమని సీనియర్లు కొందరు అల్టిమేట్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సలహాదారులే పవర్ఫుల్. రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు సైతం ఆ జిల్లాల వరకే ఉండేవారు. సలహాదారులు మాత్రం జగన్ తర్వాత అన్నట్టు పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఆ సలహాదారుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇదే అదునుగా సీనియర్లు జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెబుతున్నారు. వారు పార్టీలో ఉంటే కొనసాగలేమని తేల్చి చెప్పినట్లు బయట ప్రచారం నడుస్తోంది. మొత్తానికి అయితే ఒకటి రెండు నెలల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సంచలనాలు నమోదయ్య అవకాశం ఉంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular