spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YS Family Property Dispute: వైఎస్ పంచిన ఆస్తి వివాదాలు... విజయమ్మ కష్టం ఎవరికి రాకూడదు!

YS Family Property Dispute: వైఎస్ పంచిన ఆస్తి వివాదాలు… విజయమ్మ కష్టం ఎవరికి రాకూడదు!

YS Family Property Dispute: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రముఖ పాత్ర పోషించిన రెండు కుటుంబాలు ఆస్తి తగాదాలతో, రాజకీయ విభేదాలతో రచ్చకెక్కుతున్నాయి. రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల మధ్య వివాదాలు ఉప్పు నిప్పు మాదిరిగా ఉన్నాయి. కెసిఆర్ తనయుడు కేటీఆర్, కుమార్తె కవిత మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అయితే వీరి వివాదాల వెనుక అసలు కారణం ఆస్తివాటాల్లో వచ్చిన తేడా. వాటాల వద్ద మొదలైన తగాదాలు రాజకీయంగా రూపు మార్చుకొని విభేదాల పర్వానికి దారితీసాయి. అయితే రాజకీయంగా పేరు మోసిన ఈ రెండు కుటుంబాలు ఇప్పుడు వీధిన పడ్డాయి.

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

* తొలుత ఆర్థిక ఇబ్బందులు
వైయస్ రాజశేఖర్ రెడ్డి ( y s Rajasekhar Reddy ) 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు రెండు ఎన్నికల్లో గట్టిగానే పోరాటం చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడ్డారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో ఆర్థికంగాను ఇబ్బంది పడ్డారు. జూబ్లీహిల్స్ లోని ఇల్లు అమ్మకానికి పెట్టారు. అయితే 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి సంపాదన పై దృష్టి పెట్టారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సైతం తండ్రికి అందుబాటులోకి వచ్చారు. బెంగళూరులో పరిశ్రమలు నిర్వహిస్తూ.. తండ్రి సీఎం కావడంతో రాజకీయాల్లో మరింత క్రియాశీలకం అయ్యారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా అప్పటినుంచి ప్రారంభం అయ్యాయి. 2004 నుంచి 2009 వరకు ఐదేళ్లపాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర్ రెడ్డి. ఆ సమయంలోనే ఆయన సంపాదన భారీగా పెరిగినట్లు ప్రచారంలో ఉంది.

* సమాన వాటా కోసమే
అయితే రాజశేఖర్ రెడ్డి తన అధికారం ద్వారా సంపాదించిన ఆస్తులు రెట్టింపు అయ్యాయి. జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) వారసత్వంగా వచ్చాయి. అయితే అందులో సమాన వాటా అడుగుతున్నారు షర్మిల. తన కష్టార్జితంగా చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా సాక్షి మీడియాలో ఒక ప్రత్యేక కథనం ప్రచురించారు. షర్మిలకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తిలో సగం వాటాతో పాటు 230 కోట్ల రూపాయల తెల్లదనం కూడా ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. కానీ షర్మిల మాత్రం అందుకు ఏకీభవించడం లేదు. విజయమ్మ సైతం దానిపైనే మాట్లాడారు. షర్మిలకు రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా రావాల్సిన వాటాలు ఇంతవరకు అందలేదని.. దైవం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను అంటూ తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి షర్మిల పిల్లలకు అన్యాయం చేస్తున్నాడు అంటూ కూడా చెప్పుకొచ్చారు విజయమ్మ.

* అంతులేని సంపాదన
రాజశేఖర్ రెడ్డి తో పాటు జగన్మోహన్ రెడ్డి అంతులేని సంపాదన చేశారు. ఇప్పుడు అదే సంపాదన ఆ కుటుంబం వీధికి ఎక్కేలా చేసింది. చివరకు సొంత కుమారుడ్ని తల్లి తప్పు పట్టారు అంటే పరిస్థితి ఎంత దాకా వచ్చిందో అర్థం అవుతుంది. అయితే ఆస్తి పరమైన విభేదాలు వస్తే ఎంత దాకైనా వెళ్లేందుకు సిద్ధపడతారు. ఇప్పుడు వైయస్ కుటుంబంలో కూడా అదే కనిపిస్తోంది. చూడాలి ఈ పరిణామాలు ఎంతవరకు తీసుకెళ్తాయో. అయితే తన భర్త ద్వారా అంతులేని గౌరవం చూశారు విజయమ్మ. కానీ ఆ గౌరవం ఇప్పుడు ఆస్తి తగాదా రూపంలో బయటపడడంతో విజయమ్మ పడుతున్న బాధ వర్ణనాతీతం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper