Yugantham: అంటార్కిటికా ఖండంలో మంచు కరుగుతోంది. ఆ మంచు కరిగిన ప్రాంతంలో మొక్కలు మొలిచి అడవిని తలపిస్తున్నాయి.. ఇవి చాలవన్నట్టు స్పెయిన్ లో కుండపోత వర్షం కురుస్తోంది. 50 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. వందల మంది కన్నుమూశారు. వేలాది గ్రామాలు నీట మునిగాయి. నష్టం అంచనాలకు అందకుండా ఉంది. ఈ ఘటనలే ఇలా ఉంటే.. రష్యా – ఉక్రెయిన్ పై ఉరుముతోనే ఉంది. ఇజ్రాయిల్ – పాలస్తీనా యుద్ధం రావణ కాష్టం లాగా రగులుతూనే ఉంది. యుద్ధం ఇరాన్, లెబనాన్ దేశాలకు కూడా పాకింది.. ఇక చైనా కూడా తైవాన్ పై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇటీవల అమెరికా సిరియాపై బాంబుల వర్షం కురిపించింది. ఈ యుద్ధ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా యుద్ధం విస్తరించుకుంటూ పోతుందని, అది అంతిమంగా ప్రపంచ వినాశనానికి దారితీస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయాన్ని బల్గేరియన్ వరల్డ్ ఫేమస్ ఆంధ జ్యోతిష్కురాలు బాబా వంగా కూడా చెబుతోంది.
ఇదే తొలిసారి కాదు
భూమి అంతమవుతుందని, మానవాళి నాశనం అవుతుందని, వినాశనం తప్పదనే కుట్ర సిద్ధాంతాలు అనేవి చాలా వరకు వినిపించాయి. కనిపించాయి. ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కుడు నోస్ట్రడామస్ బాబా వంగా కూడా యుగాంతం గురించి స్పష్టంగా రాశాడని వార్తలు వినిపించాయి. అయితే అది సరికాదు. ప్రపంచంలో ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నది నిజమే. ప్రకృతి పరంగా ఉపద్రవాలు చోటుచేసుకుంటున్నది కూడా నిజమే.. కానీ జ్యోతిష్యులు ఏ ప్రాతిపదికన వారు ఈ ఉపద్రవాలను అంచనా వేశారు కచ్చితంగా తెలియదు. మార్మికంగా వారు చెప్పినప్పటికీ.. అది నిజం కాదని తెలుస్తోంది. బాబా వంగా చెప్పిన జోస్యం ప్రకారం కూడా అది నిజం అవ్వడానికి ఆస్కారం లేదని సమాచారం. 2025లో యుగాంతం అనేది దాదాపు అబద్ధమని తెలుస్తోంది. “యూరప్ లో వచ్చే సంవత్సరం భీకరమైన యుద్ధం జరుగుతుంది. గ్రహాంతరవాసులు భూమి మీదకు వస్తారు. మనుషులకు పరిచయం అవుతారు. పుతిన్ ప్రపంచ అధినేత అవుతారు. శాస్త్రవేత్తలు మనిషికి కూడా తెలియని కొత్త శక్తిని కనిపెడతారు.. యూరప్ ప్రాంతం మొత్తం 2043 నాటికి ముస్లిం పరిపాలనలోకి వస్తుంది. కమెడిజం ప్రపంచవ్యాప్తంగా 2076 నాటికి విస్తరించిపోతుంది.. మెదడుతో మెదడు అనే సమాచారం మార్పిడి మనుషుల మధ్య మొదలవుతుంది” మన దగ్గర పోతులూరి వీరబ్రహ్మం లాగానే.. పాశ్చాత్య జ్యోతిష్యులు పై విషయాలను చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
సాధ్యం కాదు
ఆ జ్యోతిష్యులు చెప్పినవన్నీ నిజం అవడానికి ఆస్కారం లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వయస్సు ప్రస్తుతం 72 సంవత్సరాలు.. ఇప్పటి అంచనా ప్రకారం చూసుకుంటే అతడు ప్రపంచానికి అధినేత అవడం దాదాపు అసాధ్యం. ఒకవేళ రష్యా చైనాతో జట్టు కట్టినప్పటికీ నాటో దేశాలు మరింత బలోపేతం అవుతాయి.. అప్పుడు బలమైన దేశాలకూటమి ఏర్పడుతుంది. ఆ ప్రకారం చూసుకుంటే పుతిన్ బలం స్వల్పం అవుతుంది. ఇక కమ్యూనిజం కూడా రష్యాలో ఎప్పుడో నాశనమైంది. చైనాలో కమ్యూనిజం కొత్తదారిలో వెళ్తోంది. అది పెట్టుబడిదారీ వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఉత్తరకొరియా లో కమ్యూనిజం కాలగర్భంలో కలిసిపోయి నియంతృత్వం తెరపైకి వచ్చింది.. ఇక ఏలియన్స్ భూమికి రావడం సాధ్యమయ్యే పని కాదు. హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టు అది ఒక కాల్పానిక ఊహ మాత్రమే. సరికొత్త శక్తిని మనిషి కనిపెడతారు అనేది కొంతవరకు నమ్మే విధంగా ఉన్నప్పటికీ.. అది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. 2043 నాటికి యూరప్ అనేది ముస్లింల చేతుల్లోకి వస్తుందనేది మిగతా మతాలవారు సహకరించిన దాన్నిబట్టి ఉంటుంది. ఒకవేళ అది సాధ్యమైతే.. ఆ ప్రభావం మన దేశంపై కూడా తీవ్రంగా ఉంటుంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Will humanity end on earth will it happen in 2025 itself
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com