Homeఆంధ్రప్రదేశ్‌ Lady Bouncers : లేడీ బౌన్సర్లు... బరుల వద్ద కెసినోలు.. ఈ ఏడాది కోడిపందాల స్పెషల్...

 Lady Bouncers : లేడీ బౌన్సర్లు… బరుల వద్ద కెసినోలు.. ఈ ఏడాది కోడిపందాల స్పెషల్ అదే!

Lady Bouncers :  సాధారణంగా ప్రముఖుల ప్రైవేటు భద్రతకు సంబంధించి బౌన్సర్లను( bouncers ) ఏర్పాటు చేసుకుంటున్నారు. బౌన్సర్ల సంస్కృతి గణనీయంగా పెరిగింది కూడా. అయితే ఇప్పుడు ఏపీలో కోడి పందాల పుణ్యమా అని లేడీ బౌన్సర్లను ఏర్పాటు చేశారు. పందెం బరుల వద్ద లేడి బౌన్సర్లు సేవలందించారు. తాడేపల్లిగూడెం పట్టణంలో ఓ శిబిరం వద్ద లేడి బౌన్సర్లు హల్చల్ చేశారు. వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోడిపందాల రద్దీని అదుపు చేసేందుకు గాను లేడి బౌన్సర్లను ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది బౌన్సర్లు వచ్చినట్లు సమాచారం.

* చేతులు మారిన కోట్లాది రూపాయలు ఏపీవ్యాప్తంగా( Andhra Pradesh) సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. కోడి పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. భీమవరంలో పందెం బరి వద్ద మూడు రోజుల నుంచి క్యాసినో నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్లడ్లైట్ల వెలుగులో రేయింబవళ్లు కోడిపందాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు తరలివచ్చారు. భారీగా బెట్టింగ్ కట్టారు. ఓ వ్యక్తి ఏకంగా కోటి 25 లక్షల పందెం కాయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుడివాడ ప్రభాకర్ రావు అనే వ్యక్తి నెమలిపుంజు విజేతగా నిలిచింది. ఈ కోడి పై భారీగా పందాలు కాశారు. తాడేపల్లి గూడెం లోని పై బోయిన వెంకట్రామయ్య కోడిపందాల బరిలో పోటీ 25 లక్షల రూపాయల పందెం కాయడం చర్చనీయాంశంగా మారింది.

* భారీగా ఏర్పాట్లు
కొన్నిచోట్ల కోడిపందాల( chicken bets) బరుల పక్కనే భారీగా ఏర్పాట్లు చేశారు. నిర్వహణ బాధ్యతలను ఇతర రాష్ట్రాల వారికి అప్పగించారు. పక్కనే మద్యం అందుబాటులో ఉండేలా చూశారు. మరోవైపు పసందైన వంటకాలను సైతం పందెం రాయుళ్లకు అందించారు. మరోవైపు రాజకీయ నేతల తాకిడి కూడా అధికంగా ఉంది. పెద్ద ఎత్తున అనుచరులతో నాయకులు హల్చల్ చేశారు. ముఖ్యంగా గోదావరి నది తీర ప్రాంతాల్లో భారీ సెట్టింగ్ లతో బరులను ఏర్పాటు చేశారు.

* కూటమి నేతల హవా
ఈసారి కోడిపందాల( chicken bets) శిబిరాల వద్ద కూటమి నేతల హవా అధికంగా ఉంది. ఎక్కడికక్కడే నేతలు ఈ బరులను ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు గోదావరి జిల్లాలో ప్రభల తీర్థం ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల నడుమ సాగింది ప్రభల తీర్థం. ఈ తీర్థ వేడుకలు చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఏటా కనుమనాడు ప్రభల తీర్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular