Homeఆంధ్రప్రదేశ్‌Kinjarapu Ram Mohan Naidu: టిడిపి కేంద్రమంత్రికి షాక్.. క్యాబినెట్ నుంచి అవుట్

Kinjarapu Ram Mohan Naidu: టిడిపి కేంద్రమంత్రికి షాక్.. క్యాబినెట్ నుంచి అవుట్

Kinjarapu Ram Mohan Naidu: ఇటీవల పౌర విమానయాన( Civil Aviation) శాఖలో చాలా రకాల పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో ఆ శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు పై విమర్శలు వచ్చాయి. గుజరాత్లో విమాన ప్రమాదం, ఇండిగో విమాన సంక్షోభం, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ విమాన ప్రమాదంలో చనిపోవడం వంటి ఘటనల నేపథ్యంలో.. యువ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పై ముప్పేట దాడి ఎదురయ్యింది. అయితే ఈ మంత్రివర్గ […]

Kinjarapu Ram Mohan Naidu: ఇటీవల పౌర విమానయాన( Civil Aviation) శాఖలో చాలా రకాల పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో ఆ శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు పై విమర్శలు వచ్చాయి. గుజరాత్లో విమాన ప్రమాదం, ఇండిగో విమాన సంక్షోభం, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ విమాన ప్రమాదంలో చనిపోవడం వంటి ఘటనల నేపథ్యంలో.. యువ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పై ముప్పేట దాడి ఎదురయ్యింది. అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో రామ్మోహన్ నాయుడు పదవి తొలగింపు ఖాయమని ప్రచారం నడుస్తోంది. తప్పకుండా ఉద్వాసన ఉంటుందని ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యువ నాయకుడికి మంత్రి పదవి లభించింది. మంచి ఇమేజ్ సొంతమవుతున్న తరుణంలో వరుసగా విమాన సంక్షోభాలు ప్రతికూలంగా మారాయి.

* హ్యాట్రిక్ విజయంతో.. శ్రీకాకుళం( Srikakulam) పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు కింజరాపు రామ్మోహన్ నాయుడు. దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రం నాయుడు కుమారుడు. ఆయన అకాల మరణంతోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అద్భుతమైన వాగ్దాటితో, టిడిపి పట్ల నిబద్ధతతో, చంద్రబాబు నాయకత్వం పట్ల వీర విధేయతతో ఉంటారు రామ్మోహన్ నాయుడు. అందుకే కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామి అయిన నేపథ్యంలో.. కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్ హోదాతో మంత్రి పదవి దక్కించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో నమ్మకంతో పౌర విమానయాన శాఖను ఆయనకు అప్పగించారు. రామ్మోహన్ నాయుడు పనితీరు పట్ల ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా.. విమాన సంక్షోభాలు నేపథ్యంలో ఆయన మార్పు అనివార్యం అని తెలుస్తోంది. అయితే రామ్మోహన్ నాయుడు సేకరణ మార్చుతారే తప్ప కేంద్ర మంత్రివర్గంలో ఆయన కొనసాగుతారని తెలుస్తోంది.

* తండ్రి శాఖకు షిఫ్ట్..
వాజ్పేయి హయాంలో కేంద్రమంత్రిగా ఉండేవారు కింజరాపు ఎర్రం నాయుడు( kinjarapu Yaram Naidu ). అప్పట్లో గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వర్తించేవారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడును పౌర విమానయాన సేకరించి మార్చితే మాత్రం కచ్చితంగా గ్రామీణాభివృద్ధి శాఖను కట్టబెడతారని తెలుస్తోంది. అదే జరిగితే రామ్మోహన్ నాయుడుకు ఒక ప్రమోషన్ లెక్క. ఎందుకంటే పౌర విమానయాన శాఖను ప్రకటించినప్పుడే ఈ యువనేత పెద్దగా ఆసక్తి కనబరచలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ శాఖను నిర్వర్తించిన తర్వాత రామ్మోహన్ నాయుడు ఇమేజ్ తగ్గుతూ వచ్చింది. మళ్లీ ఇప్పుడు గ్రామీణ అభివృద్ధి శాఖను తీసుకోవడం ద్వారా మరోసారి ఇమేజ్ పెరిగే అవకాశం ఉంది. పైగా శాఖ పరంగా శ్రీకాకుళం జిల్లాలో తన ముద్ర చూపించవచ్చు అభివృద్ధి పరంగా. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు అనేది అనివార్యం అని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper