TCS Land Allotment: విశాఖపట్నం త్వరలో ఐటీ హబ్‌గా మారబోతుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 99 పైసలకే 21.16 ఎకరాల భూమిని కేటాయించడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం విశాఖపట్నం ఐటీ రంగానికి గేమ్ ఛేంజర్‌గా మారుతుందా అనే చర్చలు మొదలయ్యాయి.
Also Read : క్యాబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డుమ్మా..కారణం ఏమిటంటే!
ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి శుభవార్తే! విశాఖపట్నంని టెక్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కి కేవలం 99 పైసలకే 21.16 ఎకరాల భూమిని కేటాయించడం, ఏప్రిల్ 15న కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చర్యతో ఏపీ ఐటీ రంగంలో గేమ్ చేంజర్ అవుతుందా అనే చర్చలు మొదలయ్యాయి.
విశాఖపట్నంని ప్రధాన సాంకేతిక కేంద్రంగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే టీసీఎస్ కు భూమిని కేటాయించింది. ఐటీ మంత్రి నారా లోకేష్ 2024 అక్టోబర్‌లో ముంబైలోని టాటా ప్రధాన కార్యాలయానికి వెళ్లినప్పుడు టీసీఎస్‌కి ఈ ప్రతిపాదనను మొదటగా వినిపించారు. తమ తదుపరి భారీ అభివృద్ధి కేంద్రం కోసం ఆంధ్రప్రదేశ్‌ను పరిగణించాలని టెక్ దిగ్గజాన్ని కోరారు.
ఆ తర్వాత నెలల్లో, ఏపీ ప్రభుత్వం టీసీఎస్‌తో నిరంతరం చర్చలు జరిపింది. చివరికి సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ చర్య ద్వారా పరిశ్రమకు స్ట్రాంగ్ మెసేజ్ పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత స్థాయి సాంకేతిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని, పోటీతత్వంతో ఉందని చాటి చెప్పాలని చూస్తోంది. ఈ నిర్ణయం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టాటా మోటార్స్‌కు సనంద్‌లో 99 పైసలకు భూమిని కేటాయించిన పారిశ్రామిక వ్యూహంతో పోల్చి చూస్తున్నారు. ఈ చర్య రాష్ట్ర ఆటోమోటివ్ రంగాన్ని ప్రోత్సహించిందని అందరూ అంటారు. ఇప్పుడు ఏపీ కూడా అదే బాటలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించాలని చూస్తోంది.
“ఐటీ రంగానికి ఇది మా సనంద్ క్షణం” అని ప్రభుత్వ అధికారి అన్నారు. “ప్రతి టెక్ కంపెనీ మ్యాప్‌లో విశాఖపట్నం ఉండాలని మేము కోరుకుంటున్నాము” అని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో కార్యకలాపాల స్థాయికి సంబంధించి టీసీఎస్ ఇంకా అధికారికంగా ప్రణాళికలను ప్రకటించలేదు. కానీ, ఈ చర్యతో విశాఖ ఐటీ రంగంలో భారీ మార్పులు వస్తాయని అందరూ భావిస్తున్నారు. అప్పట్లో గుజరాత్‌లో నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధికి దోహదపడింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే తరహాలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం విశాఖపట్నానికి ఎంతవరకు లాభిస్తుందో చూడాలి. టీసీఎస్ దాదాపు రూ. 1,370 కోట్లు పెట్టుబడి పెట్టనుంది, 10,000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఇది విశాఖపట్నం ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
విశాఖపట్నాన్ని ప్రధాన ఐటీ కేంద్రంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పం ఈ నిర్ణయంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇతర టెక్ కంపెనీలను ఆకర్షించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా అనేది చూడాలి. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది యువతకు ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
కేవలం 99 పైసలకే భూమి కేటాయించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సంకేతాలు పంపుతోంది. పరిశ్రమలకు అనుకూల విధానాలతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతుందా అనేది చూడాలి. తెలంగాణ ప్రభుత్వం సైబర్ టవర్స్ వంటి భారీ ప్రాజెక్టులతో ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. ఏపీ ప్రభుత్వం టీసీఎస్ కు భూమి కేటాయించడం ద్వారా తెలంగాణకు గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఈ నిర్ణయం విశాఖపట్నం ఐటీ రంగానికి గేమ్ ఛేంజర్ అవుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు విశాఖపట్నం ఐటీ రంగానికి ఒక కొత్త దిశను చూపుతున్నాయి.
Also Read : ఏపీలో రూ.5,000 కోట్లతో భారీ పరిశ్రమ.. ఎక్కడంటే?