Ustaad Bhagat Singh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎనలేని గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలందరిని అలరిస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో సక్సెసులు తక్కువగా ఉన్నప్పటికి పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతుంది. ఇక ఆ దిశగానే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది…ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే దిశగా ముందుకు దూసుకెళ్తుందా? లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ లో స్టోరీ తెలియకుండా జాగ్రత్త పడడానికి కారణం అదేనా?
ఒకవేళ ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ సక్సెస్ ని సాధించిన వాడు అవుతాడు. అలాగే గత సంవత్సరం ఓజీ సినిమాతో భారీ రికార్డులను కొల్లగొట్టాడు. కాబట్టి ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా ఎన్ని రికార్డులు బ్రేక్ అయితున్నాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ సినిమా మీద ప్రతి ప్రేక్షకుడు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈనెల 19వ తేదీ కోసం ప్రతి ఒక్కరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఈ సినిమా పెను సంచలనాలను సృష్టించబోతుందనేది వాస్తవం… ఇక ఈ సినిమా సక్సెస్ అయితేనే హరీష్ శంకర్ కెరియర్ అయితే నిలబడుతుంది. లేకపోతే మాత్రం అతనికి ఛాన్సులు ఇచ్చే దర్శకులు కూడా కరువైపోతారు. ఈ క్రమంలోనే ఆయన ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడు.
తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటి క్రియేట్ అవ్వబోతుందనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరో కొత్త సినిమాలో నటించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. సురేందర్ రెడ్డి చెప్పిన కథ తనకు పెద్దగా నచ్చకపోయిన కూడా మరో ఇద్దరు, ముగ్గురు దర్శకుల కథలను కూడా వింటున్నట్టుగా తెలుస్తుంది….
