AP Industry: రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీకి( Tirupati district Sri City ) కంపెనీలు పెద్ద ఎత్తున వస్తుండడం విశేషం. అక్కడ రూ.5000 కోట్లతో ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం అయ్యింది. మే 8 నా భూమి పూజ జరగనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది. మరోవైపు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఐదు ప్రాంతీయ హబ్ లు ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక పెట్టుబడులపై ప్రధానంగా దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చే పనిలో పడింది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు, సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. మరి కొన్ని కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నాయి.
Also Read: ఆమె విషయంలో తోక ముడిచిన వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా
* ఎల్జీ పరిశ్రమ విస్తరణ..
తాజాగా ప్రముఖ సంస్థ ఎల్జి( LG industry) రాష్ట్రంలో పెట్టుబడులకు గతంలోనే అంగీకారం తెలిపింది. వచ్చే నెలలో భూమి పూజకు సిద్ధమయింది. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో ఎల్జీ కంపెనీ తమ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు గత ఏడాది నవంబర్ లో ఒప్పందం చేసుకోగా.. ప్రభుత్వం 2004 ఎకరాలు భూమి కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. ఎల్జి కంపెనీ దాదాపు 5 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఎల్జి ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన సంస్థ. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు పేరెన్నిక గన్నది.
* ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారీ..
శ్రీ సిటీలో ఏర్పాటు కానున్న ప్లాంట్లో రిఫ్రిజిరేటర్లు( refrigerators ), ఏసీలు, వాషింగ్ మిషన్లు, టీవీలు, కంప్రెసర్ లను తయారు చేయనున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు 2000 మందికి ప్రత్యక్ష ఉపాధి దొరకనుంది. పరోక్షంగా వేలాది కుటుంబాలు బతకనున్నాయి. మే 8న తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో భూమి పూజకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే శ్రీ సిటీలో భారీగా పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అక్కడ అనువైన వాతావరణం ఉంది. అందుకే అక్కడకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి.
* అమరావతిలో రతన్ టాటా హబ్
మరోవైపు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ( Ratan Tata innovation hub ) ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అమరావతిలో ప్రధాన హబ్ ఏర్పాటు కానుండగా.. మరో ఐదు ప్రాంతీయ హబ్ లను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఈ హబ్ ల నిర్వహణ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పాలక మండళ్లు వీటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయి. ప్రాంతీయ హబ్ లను ప్రైవేట్ సంస్థలు చూసుకుంటాయి. ప్రభుత్వంతో పాటు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ కూడా సహాయం చేయనుంది. ప్రాంతీయ హబ్ లుగా విశాఖపట్నం, రాజమండ్రి, ఎన్టీఆర్, తిరుపతి,అనంతపురంలో ఈ ప్రాంతీయ హబ్ లు ఏర్పాటు అవుతాయి. వీటి నిర్వహణను ప్రైవేటు సంస్థలు చూసుకుంటాయి.
Also Read: ఏపీలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్.. బీసీసీఐ సంచలన నిర్ణయం