Vira Video : టీమిండియా లో ఒకప్పుడు గొప్ప ఆటగాడిగా.. టెస్ట్ ఫార్మాట్ లో గ్రేట్ వాల్ గా పేరుపొందాడు రాహుల్ ద్రావిడ్.. టీమిండియా కు అద్భుతమైన విజయాలు అందించాడు.. కోచ్ గా కూడా టి20 వరల్డ్ కప్ అందించాడు. అంతకుముందు 2023 వన్డే వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిపాడు. గత ఏడాది టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత.. తన పదవి కాలం ముగియడంతో హుందాగా కోచ్ పదవి నుంచి తప్పకున్నాడు. రోహిత్ శర్మ విజ్ఞప్తి చేసినప్పటికీ టీమ్ ఇండియాకు కోచ్ గా ఉండడానికి రాహుల్ ద్రావిడ్ ఒప్పుకోలేదు. కోచ్ పదవి కాలం ముగిసిన తర్వాత రాహుల్ ద్రావిడ్ వెంటనే తనకు క్రికెటర్ గా పునర్జన్మ ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్ గా వెళ్లిపోయాడు. అయితే జట్టుకు శిక్షణ ఇస్తున్న సమయంలో.. క్రికెట్ ఆడుతుండగా రాహుల్ ద్రావిడ్ గాయపడ్డాడు. లేవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ జట్టుకు శిక్షణ ఇస్తున్నాడు..వీల్ చైర్ లో ఉండి సంజు శాంసన్, అతని బృందానికి మెలకువలు నేర్పాడు.
Also Read : సచిన్ స్నేహితుడు వినోద్ కాంబ్లీకి సునీల్ గవాస్కర్ అండ..
రాహుల్ ద్రావిడ్ కోచ్ గా రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం పాయింట్లు పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆరు మ్యాచ్ లు ఆడి రెండిట్లో గెలిచింది. నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
శిష్యుడిని చూసి..
కేఎల్ రాహుల్ అంటే ద్రావిడ్ కు విపరితమైన ఇష్టం. అందువల్లే అతడికి విపరీతమైన అవకాశాలు ఇచ్చాడు. అతడిని గొప్ప ఆటగాడిగా మార్చడానికి తన వంతు ప్రయత్నాలు చేశాడు.. రాహుల్ ద్రావిడ్ సారధ్యంలో కేఎల్ రాహుల్ తనను తాను పూర్తిగా మలచుకున్నాడు. సరికొత్త ఆటగాడిగా ఆవిర్భవించాడు.. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ ప్రతి సందర్భంలో తన గురుభక్తిని రాహుల్ ద్రావిడ్ మీద చూపించేవాడు.. ఇక ఇటీవల బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో రాహుల్ 93* పరుగులు చేసి.. ఢిల్లీ జట్టును గెలిపించాడు. ఆ ఇన్నింగ్స్ లో చేసిన పరుగులు.. ఐపీఎల్ చరిత్రలో కేఎల్ రాహుల్ కు హైయెస్ట్ స్కోర్ కావడం విశేషం. ఈ క్రమంలో కేఎల్ రాహుల్.. తన గురువు, మార్గదర్శి రాహుల్ ద్రావిడ్ ను కలిశాడు..వీల్ చైర్ లో ఉన్న రాహుల్ ద్రావిడ్.. కేఎల్ రాహుల్ తో చాలాసేపు మాట్లాడాడు. ఇటీవల బెంగళూరు జట్టుపై ఆడిన ఇన్నింగ్స్ ను రాహుల్ ద్రావిడ్ ప్రధానంగా ప్రస్తావించాడు..” క్లిష్టమైన పరిస్థితుల్లో గొప్పగా ఆడావ్. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించు. గొప్ప ఆటగాడిగా జట్టుకు సేవలు అందించు. ఒక ఆటగాడికి గొప్ప ఇన్నింగ్స్ ఆడినప్పుడే ప్రశంసలు లభిస్తాయి. ఆ ప్రశంసలను గెలుపు పాఠాలుగా మలుచుకుని.. ఏ మాత్రం తప్పుకు ఆస్కారం లేకుండా నాణ్యమైన క్రికెట్ ఆడాలని” కె.ఎల్ రాహుల్ కు రాహుల్ ద్రావిడ్ సూచించాడు. ఇక వీరిద్దరూ సరదాగా సంభాషించుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
RAHUL MEETS RAHUL.
– KL Rahul meeting Rahul Dravid. ❤️pic.twitter.com/4U4Gy3H0vo
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2025