Deputy CM Pawan Kalyan: నేడు సచివాలయం లో అతి కీలకమైన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నో ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. సుమారుగా నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ సుదీర్ఘ క్యాబినెట్ చర్చకు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హాజరు కాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. క్యాబినెట్ సమావేశం జరిగిన ప్రతీసారి అందరూ మంత్రులు హాజరు అవుతారు. కానీ పవన్ కళ్యాణ్ నేటితో కలిపి మూడు సార్లు క్యాబినెట్ సమావేశాలకు డుమ్మా కొట్టారు. కారణం ఆరోగ్య సమస్యలే అని తెలుస్తుంది. ఇటీవలే ఆయన కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం లో చిక్కుకొని గాయాలు పాలవ్వడంతో సింగపూర్ కి వెళ్ళాడు. అక్కడ నాలుగు రోజులు ఉన్న తర్వాత రీసెంట్ గానే హైదరాబాద్ కి తిరిగొచ్చాడు. హైదరాబాద్ కి వచ్చిన తర్వాత సినిమా షూటింగ్స్ లో పాల్గొంటాడని టాక్ వినిపించింది, కానీ అలాంటివి జరగలేదు.
Also Read: జగన్ హత్యకు ప్లాన్.. మాజీ ఐపీఎస్ సూత్రధారి.. ఆప్తుడి సంచలనం!
కానీ నేడు ఆయన క్యాబినెట్ సమావేశానికి పాల్గొనేందుకు వచ్చాడట. కానీ వెన్ను నొప్పి తీవ్రంగా బాధించడంతో మధ్యలోనే తిరిగి క్యాంప్ ఆఫీస్ వెళ్ళిపోయాడట. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని అత్యంత కీలక క్యాబినెట్ మీటింగ్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనకపోవడం పై అభిమానులు సైతం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే వెన్ను నొప్పి తో ఆయన తీర్థయాత్రలకు వెళ్ళాడు, అప్పుడు వెన్ను నొప్పిని తట్టుకున్నాడు కదా, అలాంటప్పుడు రాష్ట్రంలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో మంత్రిగా పవన్ కళ్యాణ్ అభిప్రాయం, ఆమోదం లేకుండా ఏ నిర్ణయమైనా తీసుకుంటే ఆయనకే అది అవమానకమరమని, పవన్ కళ్యాణ్ పాలనలోకి వచ్చిన తర్వాత రోజుకి ఒకలా ప్రవర్తిస్తూ అభిమానులకు సైతం పిచ్చి కోపం రప్పించేలా చేస్తున్నాడని సోషల్ మీడియా లో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 75 ఏళ్ళ వయస్సు చంద్రబాబు పని చేస్తున్నంత ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ పావు శాతం కోసం పని చేయడం లేదని మండిపడుతున్నారు.
మరోపక్క పవన్ కళ్యాణ్ తన సినీ నిర్మాతలను సైతం టార్చర్ చేస్తున్నాడు. ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని ఎట్టిపరిస్థితిలో మే నెలలో విడుదల చేయాలి. లేని పక్షం లో అమెజాన్ ప్రైమ్ కాంట్రాక్టు రద్దు అవుతుంది. అదే జరిగితే 120 కోట్ల రూపాయిల నష్టం. ఇప్పటికే నిర్మాత AM రత్నం నిండా మునిగిపోయి ఉన్నాడు. పరిమితికి మించి ఈ సినిమాకు ఆయన బడ్జెట్ ని ఖర్చు చేసాడు. వడ్డీలతో కలిపి సుమారుగా 400 కోట్ల రూపాయిలు అయ్యి ఉంటుందని అంచనా. అమెజాన్ ప్రైమ్ డీల్ క్యాన్సిల్ అయితే ఈ ఏడాదిలో సినిమా వచ్చే అవకాశమే లేదు. అదే కనుక జరిగితే ఈ సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయిలు దాటిపోతుంది. కేవలం నాలుగు రోజుల డేట్స్ ఇస్తే షూటింగ్ అయిపోయే సినిమాకు పవన్ కళ్యాణ్ నిర్మాతలను ఎంతలా ఇబ్బంది పెడుతున్నాడో అని అభిమానులు సైతం ఛీత్కరించుకుంటున్నారు.