Heart Attack: మద్యం తాగకూడదు. వ్యాయామం చేయాలి. పరిమితంగా ఆహారం తీసుకోవాలి. నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మాంసాహారాన్ని ఎక్కువగా తినకూడదు. సాధ్యమైనంత వరకు ధూమపానం చేయకూడదు.. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలి. శాకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. రెడ్ మీట్ ను చాలావరకు తగ్గించాలి..ఇవే సూచనలు ఆయన తన దగ్గరికి వచ్చే హృద్రోగులకు సూచిస్తుండేవారు. పేరుపొందిన కార్డియాలజిస్ట్ కావడంతో.. రోగులకు ఆరోగ్య సలహాలు ఎక్కువగా ఇస్తుండేవారు. అనారోగ్యంతో బాధపడే రోగులకు సాంత్వన చేకూర్చేవారు. వ్యాధులను నయం చేయడంతో రోగులు ఆయనను దేవుడిగా భావించేవారు.
Also Read: తండ్రి కారణంగా రోడ్డు మీదకు వచ్చిన హీరో నాని ఫ్యామిలీ..మరీ ఇంత దారుణమా!
గుండె జబ్బులు తగ్గించి.. ఎంతోమందికి ప్రాణ భిక్ష పెట్టిన ఆయన చివరికి గుండె జబ్బుతోనే కన్నుమూశారు. ఈ దారుణం చెన్నై నగరంలో చోటుచేసుకుంది. చెన్నై నగరంలో 39 సంవత్సరాల గుండె వైద్యుడు డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ చాలా ఫేమస్. ఎంతోమందికి గుండె జబ్బులను నయం చేసిన ఘనత ఈయన సొంతం. పైగా క్లిష్టమైన ఆపరేషన్లు కూడా నిర్వహించారు. ఈయన వద్ద తమ రోగాలను నయం చేసుకొని స్వస్థత పొందినవారు వేలల్లో ఉంటారు. అటువంటి వైద్యుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చూస్తుండగానే గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. ఆ వైద్యుడి వయసు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. నిండా నాలుగుపదుల వయసు కూడా లేని అతడికి గుండెపోటు రావడం.. చూస్తుండగానే కన్నుమూయడాన్ని తోటి వైద్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతోమందికి ప్రాణ బిక్ష పెట్టిన అతడు ఇలా చనిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు.
ఒత్తిడి వల్లేనా
రాయ్ గుండెపోటుతో చనిపోవడం పట్ల తెరపైకి రకరకాల వాదనలు వస్తున్నాయి. వాస్తవానికి మనదేశంలో ఉన్న వైద్యుల్లో సకాలంలో నిద్ర ఉండదని.. నిత్యం ఒత్తిడితో కూడుకున్న పనిచేస్తుంటారని.. అంతిమంగా గుండె మీద ప్రభావం చూపిస్తోందని తెలుస్తోంది. రోగులకు చికిత్స చేసే క్రమంలో వైద్యులకు సరైన విశ్రాంతి ఉండదని.. చివరికి తినే తిండి విషయంలోనూ వైద్యులు నిర్లక్ష్యం వహిస్తారని.. అందువల్లే ఇలాంటి మరణాలు చోటు చేసుకుంటున్నయని తెలుస్తోంది. మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండాలని.. యోగా చేయాలని.. సాధ్యమైనంతవరకు ఒత్తిడికి దూరంగా ఉండాలని సీనియర్ వైద్యులు సూచిస్తున్నారు. పౌష్టికాహారాన్ని తీసుకోవాలని.. మానసిక రుగ్మతలకు దూరంగా ఉండాలని పేర్కొంటున్నారు. కరోనా తర్వాత ఇప్పటివరకు మనదేశంలో గుండెపోటుతో చనిపోతున్న వైద్యుల సంఖ్య ఏటికేడు పెరుగుతూ ఉండడం గమనార్హం.