Swiggy Zomato Shutdown AP: నేటి కాలంలో ఇంట్లో కంటే బయట తినడం పెరిగిపోయింది. అందువల్లే ఒకప్పటితో పోల్చేస్తే ఇప్పుడు హోటల్స్ ఎక్కువగా ఉన్నాయి. బయట తిండి ఆధారంగా జరిగే వ్యాపారాలు కూడా పెరిగిపోయాయి. ఫలితంగా స్విగ్గి, జొమాటో వంటి యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్స్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని.. ఇంటి వద్దకే తెప్పించుకొని తినేవారి సంఖ్య పెరిగిపోయింది.
Also Read: హర్మూజ్ జలసంధి కాదు.. మృత్యు మార్గంగా మార్చిన ఇరాన్
ఒకప్పుడు ఈ సేవలు మహా నగరాలకు మాత్రమే పరిమితమయ్యేవి. ఇప్పుడు మామూలు పట్టణాలలో కూడా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో తీవ్రమైన అంతరాయం ఏర్పడుతోంది. పైగా గల్ఫ్ దేశాల నుంచి మనకు వచ్చే గ్యాస్ నిలిచిపోయినట్టు తెలుస్తోంది. దీనివల్ల దేశంలో అత్యయిక పరిస్థితి ఏర్పడింది. దేశంలో సంక్షోభం ఏర్పడకముందే ప్రభుత్వం ముందుగానే మేల్కొంది. ఈ నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సరఫరా విషయంలో అనేక రకాల ఆంక్షలు విధించింది. ముఖ్యంగా హాస్పిటల్స్, హాస్టల్స్ కు మాత్రమే కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయాలని నిర్ణయించింది. దీంతో దేశవ్యాప్తంగా హోటల్స్ మూతపడుతున్నాయి.
మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రభావం ఇప్పుడు ఏపీ మీద కూడా పడింది. ఏపీ రాష్ట్రంలో ఉన్న హోటల్స్ ప్రతి సోమవారం బంద్ కానున్నాయి. అంతేకాదు స్విగ్గి, జొమాటో సేవలు కూడా నిలిచిపోనున్నాయి. విజయవాడలో హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. యుద్ధం నేపథ్యంలో హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల్లో స్విగ్గి, జొమాటో సేవలు ఏపీలో నిలిచి పోతాయి. ముందుగా డిస్కౌంట్లపై వేటు వేస్తారు. ఆ తర్వాత ప్రతి సోమవారం హోటళ్ల ను బంద్ చేస్తారు. గతంలో కరోనా సోకిన సమయంలో ప్రభుత్వం ఈ విధానాన్ని అప్పటి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సరఫరా తెలిసిపోయిన నేపథ్యంలో.. దీనిపై ముఖ్యమంత్రిని ఏపీ, విజయవాడ హోటల్స్ అసోసియేషన్ కలవనుంది.
స్విగ్గి, జొమాటో సేవలు నిలిచిపోతే వేలాదిమంది ఉపాధి కోల్పోతారు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, ఏలూరు, కాకినాడ, నెల్లూరు వంటి ప్రాంతాలలో స్విగ్గి, జొమాటో సేవలు అందుబాటులో ఉన్నాయి.. ఈ ప్రాంతాలలో హోటళ్లు కూడా అధికంగా ఉన్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో హోటల్ నిర్వాహకులు ప్రతి సోమవారం బంద్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.