Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ లో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ జాబితా లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. రీసెంట్ గానే ప్రముఖ టీవీ సీరియల్ హీరోయిన్ సుహాసిని ఈ షో లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వార్తలను మనమంతా విన్నాము. కానీ ఇప్పుడు ఆమె చివరి నిమిషం లో తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆమె చేతుల్లో ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్ లేదు. అయినప్పటికీ ఆమె ఈ షో నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం, కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వల్లే. ఆమె తప్పుకున్న వెంటనే బిగ్ బాస్ టీం మరో క్రేజీ సీరియల్ హీరోయిన్ దెబ్ జాన్ మెదక్ ని సంప్రదించారు. ఆమె వెంటనే ఒప్పుకుందట. బెంగాల్ లో ఈమె ఒక టీవీ సీరియల్ లో నటిస్తోంది. కానీ బిగ్ బాస్ నుండి మంచి రెమ్యూనరేషన్ ఆఫర్ రావడం తో ఆ సీరియల్ ని వదిలేసింది అట.
వారానికి ఈమెకు 4 లక్షల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారు. స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘ఎన్నెన్నో జన్మల బంధం’ , ‘సత్యభామ’ వంటి సీరియల్స్ లో ఈమె హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు, యూత్ ఆడియన్స్ లో కూడా ఈమెకు మంచి క్రేజ్ ఉంది. సోషల్ మీడియా లో ఈమెకు జెన్ జీ ఆడియన్స్ మెంటలెక్కిపోతుంటారు. రెగ్యులర్ గా ఈమె స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ లో పాల్గొంటూ ఉంటుంది. ముద్దు ముద్దు మాటలతో ఈమె మాట్లాడే మాటలు చాలా క్యూట్ గా ఉంటాయి. కామెడీ కూడా బాగా చేస్తుంది. ఈమె కోసం ‘బిగ్ బాస్ 10’ ని చూసే ఆడియన్స్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అందుకే ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేకర్స్ ఒప్పుకున్నారు. బాగా ఆడితే , మొట్టమొదటి లేడీ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఈమెకు ఎక్కువగా ఉన్నాయి.
ఇక చివరి నిమిషం లో ట్విస్ట్ ఇస్తూ ఈ షో నుండి తప్పుకున్న మరో సెలబ్రిటీ సౌందర్య రెడ్డి. ఈమె కూడా టీవీ సీరియల్ హీరోయిన్. ముందుగా ఈమె ఈ షో లో పాల్గొనేందుకు ఒప్పుకుంది కానీ , టీవీ సీరియల్ వాళ్ళు అనుమతి ఇవ్వలేదట. అందుకే ఈమె చివరి నిమిషం లో తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఈ షో లో పాల్గొనబోతున్న మరో కంటెస్టెంట్ కృష్ణుడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఈయన కమెడియన్ గా చేసాడు. ‘వినాయకుడు’ అనే సూపర్ హిట్ మూవీ లో హీరో గా కూడా నటించాడు. ఈయన కూడా ‘బిగ్ బాస్ 10’ లోకి రాబోతున్నాడు. అదే విధంగా పాపులర్ టీవీ సీరియల్ హీరో ముకేశ్ గౌడ కూడా ఈ రియాలిటీ లో కనిపించబోతున్నాడు.