spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పైసల్లేనిదే పాలిటిక్స్ లేదు.. పవన్ కు జ్ఞానోదయం

Pawan Kalyan: పైసల్లేనిదే పాలిటిక్స్ లేదు.. పవన్ కు జ్ఞానోదయం

Pawan Kalyan: ఎన్నికలంటేనే డబ్బుతో కూడుకున్న పని. డబ్బు లేనిదే ఎన్నిక ఉండదన్నది జగమెరిగిన సత్యం. వార్డు ఎన్నికకే లక్షలాది రూపాయలు ఖర్చు చేసే సమయం ఇది. అటువంటిది సార్వత్రిక ఎన్నికల అంటే ఏ స్థాయిలో ఖర్చు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఖర్చు పెట్టని అభ్యర్థి అంటే చులకనగా చూసే రోజులు ఇవి. చాలామంది నిజాయితీపరులు రాజకీయాల్లోకి వచ్చారు.డబ్బు రహిత రాజకీయాలు చేయాలని భావించారు. అయితే ఇలా వచ్చిన తరువాత వర్కౌట్ కాకపోవడంతో రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఢిల్లీలో మాత్రం అమ్ ఆద్మీ పార్టీ ఇందులో కొంతవరకు సక్సెస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా నినాదంతో ముందుకు వచ్చిన లోక్ సత్తా పార్టీ సైతం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. జనసేన అధినేత పవన్ సైతం ఈ సిద్ధాంతం తోనే రాజకీయ పార్టీని స్థాపించారు. కానీ ఈ తరహా సిద్ధాంతాలు నేటి రాజకీయాల్లో పనిచేయవని గుర్తించగలిగారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జీరో మనీ పాలిటిక్స్ తో సగర్వంగా ప్రారంభించిన జనసేన విషయంలో.. చేయడం అసాధ్యమని పవన్ కళ్యాణ్ సైతం గుర్తించగలిగారు. ప్రస్తుతం పవన్ జిల్లాల పర్యటనలో ఉన్నారు. పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పవన్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు కనిపించారు. ‘ఎన్నికల ప్రచారంలో కచ్చితంగా డబ్బు ఖర్చు పెట్టాలి. మీరు డబ్బుతో ఓట్లను కొనాలని లేదా మీరు చేయకూడదని నేను చెప్పను.అది మీరే నిర్ణయించుకోవాలి. అంతకుమించి కష్టపడి పని చేయాలి ‘అని పవన్ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.

జీరో మనీ రాజకీయాలు చేయాలని పవన్ సూచించారు. ఇప్పుడు ఆయనే డబ్బు రాజకీయం గురించి మాట్లాడడం ఆశ్చర్యం వేయక మానదు. కానీ పవన్ వాస్తవానికి దగ్గరగా మాట్లాడారు. జరుగుతున్న పరిస్థితులను గుర్తించి తన వ్యాఖ్యలను సవరించుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలంటేనే డబ్బు ప్రక్రియ గా ప్రజలు భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో మార్పు కోసం ప్రయత్నాలు చేసే పవన్ లాంటి వ్యక్తులకు వర్కౌట్ కావడం లేదు. నీతిగా, నిజాయితీగా రాజకీయాలు చేసే వారిని ప్రజలు కూడా గుర్తించడం లేదు. అందుకే పవన్ లాంటి నేతలు తమ అభిప్రాయాలను మార్చుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. ఇక ఆలోచించుకోవాల్సింది ప్రజలే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper