Pawan Kalyan vs Vijay political comparison: నిన్న తమిళనాడు లో ఎన్నికల ఫలితాలు బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియా లో విజయ్ , పవన్ కళ్యాణ్ లను పోలుస్తూ నెటిజెన్స్ పవన్ కళ్యాణ్ పై విపరీతమైన ట్రోల్స్ వేయడం మొదలు పెట్టారు. ధైర్యం గా ఎన్నికల్లో ముందుకు వెళ్తే, విజయ్ కి వచ్చిన ఫలితాలు వస్తాయని, పవన్ కళ్యాణ్ తాను ముఖ్యమంత్రి అవ్వాలని ఎప్పుడూ పని చెయ్యలేదని , జగన్ పతనం కోసమే ఆయన పార్టీ ని పెట్టాడని, 2024 ఎన్నికల్లో చంద్రబాబు అరెస్ట్ అయ్యినప్పుడు ఏర్పడిన పొలిటికల్ స్పేస్ ని వాడుకొని , ఒక ప్రత్యామ్నాయం గా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లుంటే ఆయనకు సీఎం అయ్యే అవకాశం ఉండేదని, కానీ ఆయన 15 ఏళ్ళ పాటు చంద్రబాబు ని సీఎం గా చూడాలని కోరుకుంటున్నాడని ఇలా చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు, విశ్లేషించారు.
కానీ రాజకీయ విశ్లేషకులు చెప్పేది ఏమిటంటే, తమిళనాడు లో పొలిటికల్ స్పేస్ గత పదేళ్ల నుండి ఉంది, సరైన సమయం చూసుకొని , అర్బన్ ఓటర్లను నమ్ముకొని విజయ్ రాజకీయాల్లోకి వచ్చాడు , అది ఆయనకు బాగా కలిసొచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు అందుకు పూర్తిగా భిన్నం. తెలుగు దేశం పార్టీ , వైసీపీ పార్టీలకు సంస్థాగత ఓటు బ్యాంక్ 35 శాతం వరకు ఉంటుంది. కరుడుగట్టిన ఓటు బ్యాంకు అది, పవన్ కళ్యాణ్ కి ఎంత వేవ్ క్రియేట్ అయినా 20 నుండి 25 శాతం ఓటు బ్యాంక్ మాత్రమే వస్తుంది, టీడీపీ, వైసీపీ లలో ఎదో ఒక పార్టీ పూర్తిగా భూస్థాపితం అయితేనే పవన్ కళ్యాణ్ కి ఛాన్స్ ఉంటుంది, అప్పటి వరకు ఎదురు చూడక తప్పదని అంటున్నారు. 2024 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వేవ్ కారణంగా యూత్ ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపారు.
పవన్ కళ్యాణ్ వేవ్ కారణంగా కచ్చితంగా 20 శాతం ఓటు బ్యాంక్ కూటమికి అదనంగా తోడైంది, భవిష్యత్తులో ఇలా మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా యువత మీద ఆధారపడి రాజకీయాలు వస్తాయి. అప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ కి ఒక స్పేస్ ఏర్పడుతుందని అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడు లో విజయ్ కి ఆ స్థాయి ఓటింగ్ రావడానికి కారణం , అర్బన్ ప్రాంతాల్లో ఉన్న యువత నే, అలాంటి యువత మనకు కూడా చాలామంది ఉన్నారు కానీ, అది ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేంత రేంజ్ లో కాదని అంటున్నారు. అలాంటి రోజు రావాలంటే పవన్ కళ్యాణ్ 2034 వరకు ఎదురు చూడక తప్పదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.