Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh AP IT development brand: నారా లోకేష్.. ఇది పేరు కాదు.. ఏపీ...

Nara Lokesh AP IT development brand: నారా లోకేష్.. ఇది పేరు కాదు.. ఏపీ ఐటీ కి సరికొత్త బ్రాండ్

Nara Lokesh AP IT development brand: రాజకీయ నాయకుల ఆలోచన ధోరణిలో స్వార్థం ఉంటుంది.. కుట్ర ఉంటుంది.. కపటత్వం ఉంటుంది అంటారు. ఇందులో నిజం లేకపోలేదు. కాకపోతే కొంతమంది రాజకీయ నాయకులు ఇలా ఉండరు. వారికి రాజకీయాల కంటే ప్రజాసేవ చేయడమే చాలా ఇష్టం. ప్రజలు అభివృద్ధి చెందుతూ ఉంటే చూస్తూ ఉండడం ఇష్టం. తమ ప్రాంతం ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే ఆనందించడం మరింత ఇష్టం. ఇలాంటి నాయకుల జాబితాలో ఏపీ ఐటి మినిస్టర్ నారా లోకేష్ శిఖర స్థానంలో ఉంటారు.

నారా లోకేష్ ఉన్నత విద్య విదేశాలలో చదివారు. మొదటినుంచి కూడా ఆయనకు ఐటి మీద విపరీతమైన పట్టు ఉంది. అందువల్లే ఐటీ సేవలను ఎలా విస్తరించాలి అనే అంశం మీద ఆయన తీవ్రస్థాయిలో మధనం చేశారు.. ఏపీలో ఐటీ రంగాన్ని ఎలా గాడిలో పెట్టాలి అని ఆలోచించారు. గతంలో పనిచేసిన గుడ్డు ఐటీ మినిస్టర్ మాదిరిగా కాకుండా.. లోకేష్ వినూత్నంగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఏపీ రాష్ట్రానికి ఐటీ విభాగంలో పెట్టుబడును ఎలా తేవాలి? కంపెనీల ప్రతినిధులను ఎలా ఒప్పించాలి? అనే అంశాలపై తీవ్రంగా ఫోకస్ పెట్టారు. మొత్తానికి తాను అనుకున్నది సాధించారు.

ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు నారా చంద్రబాబునాయుడు తో కలిసి లోకేష్ వెళ్లారు. ప్రపంచ స్థాయి కంపెనీల అధిపతులను ఒప్పించారు. ఏపీ రాష్ట్రం పెట్టుబడులకు ఎందుకు స్వర్గధామమో వివరించారు.. ఒక రకంగా ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులోనే మల్టిమేషనల్ కంపెనీల ప్రతినిధులను మెస్మరస్ చేయగలిగారు. లోకేష్ ఇంగ్లీష్ కూడా చాలా బాగుంటుంది. అనర్గళంగా మాట్లాడతారు. లెంతి క్వశ్చన్ అని సిల్లీ మాటలు మాట్లాడకుండా.. తనను పాత్రికేయులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతారు. ఒకరకంగా ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఏపీకి ఒక బ్రాండ్ పేరును తీసుకొచ్చారు నారా లోకేష్.

విశాఖపట్నంలో గూగుల్ ప్రపంచ స్థాయి డాటా సెంటర్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో హైపర్ స్కిల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడంలో లోకేష్ కీలకపాత్ర పోషించారు. ఫలితంగా విశాఖపట్నం గ్లోబల్ టెక్ క్యాపిటల్ గా మారబోతోంది. ఇక్కడ విశేషమైన భూములు ఉన్నాయి. విస్తారమైన వనరులు ఉన్నాయి. అద్భుతమైన ప్రకృతి ఉంది. అంతకుమించిన మానవ వనరులు ఉన్నాయి. అందువల్లే విశాఖపట్నం నగరంలో ఈ స్థాయిలో పెట్టుబడులను ప్రపంచ స్థాయి కంపెనీలు పెట్టేలా లోకేష్ కృప కల్పన చేశారు.

నారా లోకేష్ రాష్ట్రంలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచింది. అందువల్లే విశాఖపట్నం నగరంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. గూగుల్, ఆదాని, ఎయిర్టెల్ వంటి గ్లోబల్ సంస్థలు భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ లో ఏఐ, క్లౌడ్ హబ్ ఏర్పడుతోంది. దీని సామర్థ్యం ఒక గిగా వాట్.. భారతదేశంలోనే ఈ స్థాయిలో క్లౌడ్ హబ్ ఏర్పడటం ఇదే మొదటిది.. లోకేష్ చొరవ వల్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కావడంతో విశాఖపట్నం రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. అవన్నీ పూర్తయిన తర్వాత విశాఖపట్నం ప్రపంచంలోనే తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటుంది.. ఒకప్పుడు ఐటీ ని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయన కుమారుడు లోకేష్ ఏఐయుగంలో సరికొత్త టెక్నాలజీని ఏపీ రాష్ట్రానికి పరిచయం చేస్తున్నారు. తరం మారినా సరే.. చేసే పని మారలేదు. చేయాల్సిన అభివృద్ధి మారలేదు. ఎందుకంటే రాజకీయ నాయకులకు రాజకీయాలు తాత్కాలికం. ప్రజాసేవ మాత్రమే శాశ్వతం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper